సెప్టెంబరులో ఈ రాశుల తలరాతను మారుస్తున్న గజకేసరి రాజయోగం

సెప్టెంబరు నెలలో వృషభరాశిలో బృహస్పతితోపాటు చంద్రుడు కలుస్తున్నాడు. ఈ కలయికవల్ల అద్భుతమైన గజకేసరి యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశులవారి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. సెప్టెంబరు నెల మొదటివారంలో ఏర్పడే ఈ యోగంవల్ల నెలమొత్తం కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అనుకున్న పనులు సాధించడంతోపాటు కెరీర్ లో దూసుకువెళతారన్నారు. గజకేసరి యోగం వల్ల ఏయే రాశులవారు ఏవిధంగా లాభం పొందుతున్నారో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
స్నేహితుల నుంచి మద్దతు లభించి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి ఊహించని ధనలాభం కలగబోతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. అనుకున్న పనులన్నింటినీ పూర్తిచేయడంలో అదృష్టం తోడుంటుంది.

The Gajakesari Raja Yoga due to the conjunction of the Moon in Taurus

వృషభ రాశి
దాంపత్య జీవితంలో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి అనూహ్యరీతిలో మద్దతు సాధించి ఆర్థికంగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి మద్దతు లభించి మంచిపేరు తెచ్చుకుంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. వృత్తిపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ సునాయాసంగా విజయాన్ని సాధిస్తారు. న్యాయపరమైన విషయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. వాదనలు కూడా మీవైపు బలంగా ఉంటాయి.

కన్యా రాశి
ఈ రాశివారికి ఈ నెల మొత్తం అదృష్టం కలిసివస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అవి ఆర్థికంగా కలిసివస్తాయి. ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు అన్నీ శుభాలే ఉన్నాయి. వృత్తి జీవితాల్లో ఉన్నవారు చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొంతకాలంగా పిల్లల నుంచి వస్తున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. వారినుంచి శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+