ఆజ్ఞా చక్రం జ్ఞానానికి తాళం చెవి: ప్రాణశక్తి కేంద్రీకరణ
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: సులభతర కుండలీ యోగములో ఆజ్ఞాతపస్సు మొదటి మెట్టు.ఈ తపస్సులో భ్రూమధ్యంలోని ఆజ్ఞా చక్రంలో ప్రాణశక్తి మీద మనసు కేంద్రీకరించటం జరుగుతుంది.ఇంత వరకు మూలాధార చక్రము నుండి పనిచేస్తున్న ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రానికి తీసుకురావటం జరుగుతుంది. ఆజ్ఞా చక్రం సహస్రార చక్రానికి ఒక తాళం చెవి లాంటిది.మొదటిది ఆరోగ్య వంతంగా ఉంటే రెండవది అదుపులో ఉంచుకోవచ్చు.7 సంవత్సరాల వరకు పిల్లలు అమాయకత్వంతో ఉంటారు. ఆ తరువాత 7 - 8 సంవత్సరాల వయస్సు నుండి పీనియల్ గ్రంథి దోషపూరితమై వారి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటాయి.

అమాయకత్వం, దైవత్వం పోయి మనసు కలుషితమవుతుంది.అందుకే పూర్వం రోజులలో ఆ వయసులోనే పిల్లలకి "ఉపనయనం" చేసేవారు. సంధ్యా వందనం, గాయత్రీ పఠనం చెయ్యడం వలన మంచి నడవడిక అలవడేది.ఇప్పుడు ఈ కాలంలో పీనియల గ్రంథి లోపాలను సవరించడానికి త్రాటకం, శాంభవీ ముద్ర చెయ్యాలి.
ఆజ్ఞా చక్రం 2 దళాలు కలిగిన పద్మం.ఇది నీలి బూడిద రంగులో ఉంటుంది. దీని యొక్క రెండు దళాలలో ఒక దళం పైన "హం" అని రెండవ దళం పైన "క్షం" అనే అక్షరాలు ఉంటాయి. ఇవి శివ , శక్తులకు సంబంధించిన దళ బీజమంత్రాలు. ఈ చక్ర బీజ మంత్రం "ఓం" కుండలినీ ఆజ్ఞ చక్రంలో పనిచేయటం ప్రారంభించగానే,అంత వరకు ఇంద్రియాల ద్వారా పని చేస్తున్న మనసు క్రమంగా కుండలినీ వైపుకు మరలుతుంది.

ఆజ్ఞా చక్రంలో తల క్రిందులుగా ఒక త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణం "శక్త" కి ప్రతీక. ఈ త్రికోణం లో ఒక నల్లటి శివలింగం ఉంటుంది. ఈ శివలింగం పైన "ఓం" బీజాక్షరం ఉంటుంది. దాని పైన అర్ధ చంద్రాకారం (present moon) ఉంటుంది. తరువాత ఒక బిందువు ఉంటుంది. ఈ శివలింగం "astral body" కి సూచిక గా చూపిస్తారు. ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత "పరమ శివుడు." ప్రతి రోజు ఆజ్ఞాచక్రంలో మేడిటేషన్ (ధ్యానం) చేసిన వారికి ఈ క్రింది ప్రయోజనాలు కగుతాయి.

ప్రయోజనములు:-
* వస్తు వ్యామోహం తగ్గును.
* తనను తాను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
* సన్మార్గంలో నడిచే సామర్ద్యం కలుగుతుంది.
* దురాశను నియంత్రించును,కోర్కేలను అదుపులోనుంచును.
* మనసులో జ్ఞానాభివృద్ధి కలుగును.
* ఆకామ్య కర్మలనుండి విముక్తుడిని చేయును.
* ఏకాగ్రత,శ్రద్ద,నేర్పరితనం,ఔన్నత్యము పెంపొందించును.మన:శాంతి కలుగును.
* ఆరోగ్యము పెంపొందించును,ముఖము తేజోవంతమగును.
-
జన్మ నక్షత్రం అశ్వని, భరణి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
వాస్తు ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అద్దాలున్నాయా? -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..!












Click it and Unblock the Notifications