ఆత్మానాత్మ వివేకము అనగానేమీ?

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: ఆత్మానాత్మ వివేకము అనగా..

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం /
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం //

ఇదానీ మాత్మాన: సచ్చిదానంద స్వరూపత్వముచ్యతే /
సద్రూపత్వం నామ, కేనాప్యబాధ్యమానత్వేన కాలత్రయే ప్యేకరూపేణ విద్య మానత్వముచ్యతే /
చిద్రూపం నామ, సాధనాంతర నిరపెక్షతయా స్వయం ప్రకాశమాన:
సం స్వస్మిన్నారోపిత సర్వ పదార్ధావ భాసక వస్తుత్వం చిద్రూపత్వ మిత్యుచ్యతే/
ఆనందస్వరూపం నామ, పరమప్రేమా స్పదత్వం నిత్య నిరతిశయత్వమానందత్వ మిత్యుచ్యతే /
నిత్య విజ్ఞాన మానందం బ్రహ్మ రాతి దాతు: పరాయణమితి శ్రుతే: /
ఏవ: నిత్యశుద్ధ బుద్ధ ముక్తస్వభావం/
బ్రహ్మాహమస్మీతి సంశయాసంభావనా విపరీతభావనా రాహిత్యేన యస్తు జానాతి స జీవన్ముక్తో భవతీతి//

the story about atma anatma vivekam

దీని భావం ఏమనగా మనిషి ఆత్మ యొక్క సత్, చిత్, ఆనంద స్వరూపత్వాన్ని గురించి తెలియజేయబడినది. ముందు సత్ గురించి. ఆత్మ అనేది ఈ శ్రుష్టి లో దేని చేత ఆపబడదు. మూడుకాలాలోనూ అప్రతిహతమైనది.ఏ విధమైన మార్పులేకుండా, అభిన్నస్వరూపంలో ఉండేది కాబట్టి ' సత్ '.

ఛిఛక్తి అనేది ఇతర సాధనాలు వేటిని అపేక్షించకుండా స్వయం ప్రకాశమానమ్. తనలోనే పదార్ధాలను ఇముడుచుకోగలిగిన తేజోవంతమైనది.

ఇదే చిద్రూప తత్వం. జ్ఞాన స్వరూపం.

ఆనంద స్వరూపమనేది పరమ ప్రేమాస్పదమైనది. నిత్యమైనది.ఇటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపం కలది ఆత్మ - బ్రహ్మ.ఈ బ్రహ్మ నిత్యుడు, విజ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అని వేదాలు చెబుతున్నాయి. ఈ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగినట్టి బ్రహ్మను నేనే అనే విషయంలో సందేహం కానీ అశక్తత గానీ ప్రతికూలభావం గానీ లేకుండా నిశ్చయమైన బుద్ధితో నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకునే వాడు. ఈ విధమైన ఆత్మజ్ఞానం ( ఆత్మా వివేకమ్ ) వలన మనిషి జీవన్ముక్తుడు అవుతాడు.

ఇది శ్రీ శంకరాచార్య విరచిత: ఆత్మా నాత్మ వివేక సారాంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+