వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మతిధులు, వాటి ఫలితాలు: జీవితంపై ప్రభావం ఎలా ఉంటుంది?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: పంచాంగం
మనం నిత్యవ్యవాహరంలో శుభాశుభ కర్మలన్నిటికి విశేషాలను గమనించడానికి ఉపయోగపడే గ్రంధానికి పంచాగం అని పేరు.తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాలకు పంచాంగం అని పేరు. ఈ ఐదు అంగాలే కాక లగ్న,ముహూర్త,ప్రయాణ సంబంధమైన ఎన్నో విశేషాలను వివరించడానికి ఈ కరదీపికను ఉపయోగిస్తారు.
భారతీయుల నిత్యజీవన వ్యవహారంలో పంచాంగం లేకుండా పని జరగదు.అన్ని విశేషాలకు,పర్వాలకు,శుభాశుభ వ్యవహారాలకు పంచాంగం అవసరం అవుతుంది.

 the story about janma tithi

తిధులు,సూర్యోదయ,సూర్యాస్తమయ సమయాలు,శుభాశుభ సమయాలు,నక్షత్రాలు,వివిధ యోగాలు ,లగ్నాలు అన్నింటి విషయాలు పంచాగంలో తెలుస్తాయి.
పంచాంగం అంటే ఏమిటి?
అయిదు అంగాలు కలది పంచాంగం.దీనికి తిధి పతి అని పేరు కూడా కలదు.దీనిలో తిధి,వార,నక్షత్రం,యోగం,కరణం అనే అయిదు అంగాలు ఉంటాయి.

ఇవి ప్రతిదినం ఏ సమయం వరుకు ఉన్నాయో తెలిపేది పంచాంగం. ఈ అయిదు అంగాలతో పాటు రవ్యాదుల స్థిత్యాది విశేషాలు ఉంటాయి.

పంచాంగం యొక్క ప్రయోజనాలు: వైదిక కర్మలు చేయవలిసిన కాలాన్ని తెలపడం,ఆకాశంలో ఉన్నమొదలు అయిన వాటి సరి అయిన స్థితిని తెలపడం,దాని వలన మానవులకు,దేశానికి కలిగే మంచి చెడులను తెలపడం ప్రయోజనాలు.ఉత్తమ తిధివార నక్షత్ర యోగ కరణాలు గ్రహించి సుమూహుర్తాలు పెట్టుకోవడానికి, చెడ్డ తిధి,వారదులను సుమూహుర్తాలలో వదిలివేయటానికి పంచాంగం ఉపయోగపడుతుంది.కొన్ని తిధి వార నక్షత్రాదులు కొన్ని పనులకు విధించబడ్డాయి.

స్నానం, పూజ, జపం,హోమం మొదలగునవి ధార్మిక కార్యాలను చేసేందుకు కాలసంకీర్తనం చేయాలి.దానిలోసంవత్సరం,ఆయనం,ఋతువు,మాసం,పక్షం,తిధి,వారం చెప్పాలి.వీటిని పంచాంగం ద్వార గ్రహించాలి.
ఇప్పడు మనం పంచాంగాలు గురించి వివరంగా తెలుసుకొందాం.

ఇవి ఐదు సూర్య,చంద్ర గమనాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది తిధి .
తిధి: చంద్రుడు సన్నని రేఖలా కనిపించి క్రమంగా వృద్ధి చెందుతూ 15 వ రోజుకి పూర్తిగా పూర్ణ చంద్రుడుగా కనిపిస్తాడు,మరల క్రమంగా క్షీణిస్తూ 15 వ రోజుకి అసలు కనిపించకపోవటం మనం గమనిస్తూ ఉంటాము .చంద్రుడు పూర్తిగా కనిపించిన రోజును పూర్ణిమ అని అస్సలు కనిపించని రోజుని అమావాస్య అని అంటాము.ఈ ప్రక్రియ మొత్తం 29 ½ రోజులలో జరుగుతుంది.సూర్యుడు నుండి 12 డిగ్రీల దూరానికి ఒక తిధి ఏర్పడుతుంది.ఎలా 180 డిగ్రీల దూరం ఇద్దరి మధ్య ఏర్పడే సమయానికి పౌర్ణిమ ఒకే డిగ్రీలో కలిసినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది.
మనం పుట్టిన తిధి ప్రకారం వాటి ఫలితాలు ఏలా ఉంటాయో తెలుసుకొందాం .

పాడ్యమి:- ఈ తిధి యందు జన్మించిన దేవపూజ తత్పరుడు, ఙ్ఞానం కలిగినవాడు,శిల్ప విద్య విశారదుడు,మంత్రమందు అభిచార (చేతబడి) కర్మయందు సమర్ధుడు .

విదియ:- ఈ తిధి యందు జన్మించిన, శత్రువులను హతమార్చువారు,పశువులు యందు దయ కలవాడు,పరాక్రమము కలిగిన వాడు, అభిమానము ,సంపద గలిగినవాడు అయి ఉండును.

తదియ:- ఈ తిధి యందు జన్మించిన అమితమైన సౌందర్యం,అభిమానం ధనం కలవాడు,విద్యగలవాడు,మనస్సున అహంకారి,బంధువుల కార్యమందు ఇష్టము కలవాడు .

చవితి:-ఈ తిధి యందు జన్మించిన సర్వకార్య విఘ్నము చేయువాడు,క్రూరుడు,ప్రపీడనానికి ఉన్న మార్గాన్ని అన్వేషించు వాడు,అత్యాశ కలవాడు, లావాటి శరీరం కలవాడు వ్యసములు కలవాడు అయి ఉండును.

పంచమి:- ఈ తిధి యందు జన్మించిన సౌభాగ్యము,పాండిత్యము,సంపద కలవాడు,మాలావస్త్రము మొదలగు అలంకార వస్తువులందు ఇష్టము కలవారు ఇతరులకు ఉపకారం చేయువాడు.

షష్టి:- ఈ తిధి యందు జన్మించిన బలము,చాల సేవకాజనులు కలవాడు,ముక్కోపి, ఙ్ఞానం కలవాడు,దైవపూజయందు ఇష్టము కలవాడు, క్షేమము గలవాడు,ఇతరములు యొక్క మంచిని గుణములను స్వీకరించు వాడు.

సప్తమి:- ఈ తిధి యందు జన్మించిన క్రూరముగా పలుకువాడు,చెడ్డ మనస్సు గల సేవకాజనులు కలవాడు,శుభకర్మ యందు ఇష్టము కలవాడు,ఇంద్రియ నిగ్రహం కలవాడు,బలవంతుడు,రోగపీడితుడై ఉండును.

అష్టమి:-ఈ తిధి యందు జన్మించిన పరాక్రమము,స్వాతంత్రము కలవాడు,పీడించువాడు,వెంటనే కోపించే వాడు, మంచి శరీరం,కామశీలం కలవాడై ఉండును.

నవమి:- ఈ తిధి యందు జన్మించిన కోపము,స్వకార్య ఇష్టతయు,ఇతరులను ద్వేషించుట,చెడ్డ భార్యా పుత్రులు కలవాడు,దొంగలకు నాయకుడై ఉండెను.

దశమి:- ఈ తిధి యందు జన్మించిన ధర్మశీలము,సుఖము,సత్ స్వభావము,సంపదయు,వాక్ సామర్ధ్యము కలవాడు,కాముకుడు,బంధు స్నేహం కలవాడు, పరస్త్రీలందు ఆసక్తి గలవాడు అయి ఉండును.

ఏకాదశి:- ఈ తిధి యందు జన్మించిన పూజ్యుడు,సదాచారం కలవాడు,మంచి సేవకులు కలవాడు,సౌభాగ్యము,సంపద,మంచి స్వభావము కలవాడు అయి ఉండును.

ద్వాదశి:- ఈ తిధి యందు జన్మించిన విష్ణు భక్తుడు ,త్యాగి,ధనవంతుడు,ప్రభువు,సర్వజనప్రియుడు,నిర్మల మనస్సు కలవాడు,విద్యావంతుడు,పుణ్యవంతుడు అయి ఉండును.

త్రయోదశి:- ఈ తిధి యందు జన్మించిన కామియు,దర్భల శరీరుడు,సత్యం పలుకువాడు,మనోహరుడు,లుబ్ధుడు,ధనహీనుడు అయి ఉండును.

చతుర్దశి:- ఈ తిధి యందు జన్మించిన పరస్త్రీలను, ఇతరులను ద్రవ్యం అడుగువాడు, తెలివి తక్కువు వాడు,అందరికి శత్రువై ఉండును. కోపము, దుస్వభావము.భయంకరుడు అయి ఉండును.

పౌర్ణమి:- ఈ తిధి యందు జన్మించిన పరిపూర్ణమయిన అంగములు కలవాడు,విద్య ,వినయము ,యశస్సు కలవాడు,శాస్త్ర అర్ధములు తెలిసినవాడు ప్రధాని అయి ఉండును.

అమావాస్య:- ఈ తిధి యందు జన్మించిన దేవతలను,తల్లితండ్రులను పూజించు వాడు,కామి,పశుసంపదను నాశనం చేయువాడు,రోగి,బలం లేని శరీరం కలవాడు,దరిద్రుడు అయి ఉండును.

శుక్ల పక్షం యందు తిధులకు చెప్పిన శుభఫలములలో వృద్ధి,అశుభ ఫలములకు హానియు ,బహుళ పక్షము నందు తిధులలో శుభఫలములు తగ్గుత,అశుభ ఫలములు పుష్టియు అగును. చంద్రుడు బలాబలములను అనుసరించి శుభ ఆశుభములను అనుసరించవలెను.

English summary
The Astrologer told the story about Janma Tithis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X