దీపంనకు నవగ్రహాలకు ఉన్న సంబంధం మీకు తెలుసా?

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: మనం దేవుని పూజ కొరకు రోజు వెలిగించే దీపంనకు నవగ్రహాలకు ఉన్న సంబంధం మీకు తెలుసా ?ప్రమిదలో దీపం వెలిగించడంలో ఉన్న నిగూఢ అర్థము దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచి ఆయా గ్రహ ప్రభావ దోషాలను తొలగిస్తుంది.ఏ దేవునికైనా ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చును.ప్రమిద అందులోని నూనె,వత్తులు, కాంతికి, నవగ్రహాలకు సంబంధం ఉంది.ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని శాస్త్ర వచనం.

the story about relation between navagraha and light

1. ప్రమిద దీపం - సూర్యుడు

2. నెయ్యి, నూనె- ద్రవ పదార్థం - చంద్రుడు

3. వత్తులు - బుధుడు

4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల- అంగారకుడు

5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది.

6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు

7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం

8. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి - ఇది జ్ఞానం... కేతువునకు సంకేతం

the story about relation between navagraha and light

9. ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి శుక్రుడు సంకేతం. శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
తమసోమా జ్యోతిర్గమయా!

ఆశలతో మానవజన్మ సార్థకం కాదని, తద్వారా మోక్షం లభించడం కష్టమని, తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతూ, విషయవాసనల చక్రంలో బందీ అవుతాడు. కనుక కర్మలన్నియు భగవదర్పిదంగా చేయవలెనని "గీత" బోధిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+