వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాస్త్రం(శాస్త్రీయం)తో రావి చెట్టును పూజించుటకు గల కారణం తెలుసా?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు ఏమిటి? అని గ్రంధ పఠనం చేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయి.అశ్వత్ధ వృక్షం అని దేవనాగరిక భాషలో పిలుస్తారు , హిందీలో పీపల్ జాడ్ అంటారు. దీనికే బోది వృక్షం అని పేరు కూడా ఉంది.ఈ రావి చెట్టులో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణములో నారదుడు వివరించాడు. అశ్వత్ధమే శ్రీమన్నారాయణ స్వరూపము.ఈ వృక్షం యొక్క మూలము భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు,చివరి భాగములో శివుడు ఉంటారు.త్రిమూర్థుల స్వరూపమైన ఈ చ్జెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించుకున్నట్లే అవుతుంది.

ఈ చెట్టు చిరకాలం జీవించునది కాబట్టి దీనిని బోదిదృవు అంటారు.అనగా ఈ చెట్టు క్రింద యోగ సమాధి స్థితిలో కూర్చుని తపస్సు చేస్తే మోక్షం కలుతుందని పూర్వం ఋషులు తపస్సు చేసేవారు.బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది ఈ చెట్టు క్రిందనే.ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో కూడ నెలవై ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాది దేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోవులు, నాలుగువేదాలు ఉంటాయి.

the story about worship of Sacred fig

అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్ధ వృక్షం మూలములో 'అ' కారము, మానులో 'ఉ ' కారము, అది ఇచ్చే పళ్ళలో 'మ' కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.

ప్రదక్షిణలు మరియు పూజించు విధానము :రాగి చెంబులో నీళ్ళను పోసుకుని అందులో చిటికెడు పసుపు,కుంకుమ ఒక పువ్వు వేసుకుని అవకాశం ఉంటే కొన్ని పచ్చిపాలు పోయాలి.అగర్బత్తి,చక్కర,పూలు మొదలగు పూజ వస్తువులను తీసుకుని వెళ్ళి ఆ చెంబులోని నీళ్ళను చెట్టు మొదల్లలో(వేర్లకు) పోస్తూ నీ మనస్సులో ఏ కోరిక ఉందో మనసులో స్మరించు కోవాలి.ఆ తర్వత తీసుకు వెళ్లిన చక్కరను చెట్టు చుట్టూ చల్లాలి.దీపం,అగర్బత్తి మొదలగునవి వెలిగించిన తర్వత
ప్రదక్షిణలు చేయాలి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.ఎట్టి పరిస్థితులలో కూడా చెట్టును తాక కూడదు, కేవలం శనివారం మాత్రమే తాకాలి ప్రదక్షిణలు అనేవి 11 సార్లు చేయాలి. ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి.

మూలతో బ్రహ్మరూపాయ

మధ్యతో విష్ణురూపిణే

అగ్రత శ్శివరూపాయ

వృక్షరాజయతే నమః

ఈ మంత్రాన్ని చదవలేము అనుకున్నవాళ్లు "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనుకుంటూ ప్రదక్షిణలు చేసినను మంచి ఫలితం దక్కుతుంది.లేదా చదువు వచ్చిన వాళ్లు మౌనంగా నిధానంగా నడుస్తూ విష్ణు సహస్ర నామాలను చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.

అశ్వత్ధ వృక్ష పూజా ఫలము వలన సంతాన సమస్య ఉన్నవారు
బిడ్డలు కలగాలనే సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే ఆపద్ మృత్యు భయం పోతుంది.ఇక్కడ కొట్టిన కొబ్బరికాయను తప్పక అక్కడే భక్తులకు పంచాలి.ఇంటికి తీసుకపోకూడదు.

ఎన్నో దివ్వ్య ఔషదగుణములు కలిగిన ఈ చెట్టు ఆనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.కంచుక అనే ఒక భయంకర వ్యాధికి ఈ ప్రపంచంలో ఎక్కడైన ఏ చికిత్సకు తగ్గని ఈ వ్యాది కేవలం నిష్టాగరిష్టులైన విశ్వబ్రాహ్మణుల పూజాతత్రంచే తగ్గుతుంది.రోగి వ్యాధి నివారణ కొరకు వారు చెట్టునకు పూజించి ఎవరి కంట కనపడకుండా ఆ చెట్టు ఒకే కొమ్మకు ఏడు ఆకులు ఉన్నదానిని తెంపుకుని జాగ్రత్తగా ఇంటికి తెచ్చి దానికి ప్రత్యేక పూజచేసి ఆ ఏడు ఆకులకు జాజుతో దోష నివారణగల యంత్రాన్ని గీసి ధూపం వేసి రోగి శరీరానికి పై నుండి క్రిందకు ఏడు సార్లు దిగతుడుస్తారు.ఇలా ఏడు మంగళవారాలు చేయడంతో అదోక మాయలాగ రోగి రోగం తగ్గిపోతుంది.విచిత్రం ఏమిటంటే దీనికి ఏ మేడిసిన్ కూడా పనిచేయవు.డాక్టర్లకు అంతుపట్టదు.ఇలా అనేక రోగ, గ్రహాదోషాల నుండి విముక్తులను చేస్తుంది.అర్ధాష్టమ శని,అష్టమ శని,ఏలినాటిశని నడుస్తున్నవారు శనివారంనాడు అశ్వత్ధ ( రావి ) వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.

అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం

కోణస్థ: పింగళో బభ్రు:
కృష్ణో రౌద్రాంతకోయమః

శౌరీ శ్శనైశ్చరో మందః
పిప్పిల దేవ సంస్తుతః

రావి ఆకులను మేకలు ఇష్టపడి తింటాయి ఇది మీరు ఎప్పుడైన గమనించారా ? ఈ ఆకులలో అనేక ఔషదగుణాలు ఉండడంచేత మేక కడుపులో ఆయుర్వేద వైద్యమునకు పనికి వచ్చే మేకరాళ్లు తయారు అవుతాయి.ఈ మేకరాళ్లు ఎంతో విలువైనవి.ఈ చెట్టులో విద్యుత్తు ఉంటుంది, అందుకే మనల్ని తాకకూడదు అని చెప్పారు.మీకు ఒక సందేహం కలగవచ్చు చెట్టులో విద్యుత్తు ఉంటే మనం ముట్టుకుంటే షాక్ రావడం లేదు కదా అనిపించ వచ్చు.ఆ మద్య కాలంలో న్యూస్ పేపర్లో ఈ చెట్టు ప్రత్యేకత సైంటిఫిక్ ఆధారలు తెలుపుతూ ఆర్టికల్ వచ్చింది.రావి ఆకుతో సెల్ ఫోన్ చార్జ్ చేయవచ్చు అని (దీనిలో విద్యుత్తు ఉందని ఋజువు చేసారు).

దీనిని సూక్ష్మంగా గమనిస్తే అర్ధం అవుతుంది.చెట్టువిద్యుత్తును ప్రసారంచేస్తుంది.సప్తధాతువులతో కూడినది మానవ శరీరం కాబట్టి మనం చెట్టును తాకితే దానిలో ఉండే విద్యుత్తు వలన మనలో ఉండే దాతువులు షాకునకు గురు అయ్యి కొంత శక్తిని కోల్పోతాయి కాబట్టి సైంటిఫిక్ గా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.నార్త్ ఇండియన్స్ ఈ చెట్టు ఎక్కడ ఉన్న ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ఈ చెట్టునకు ఇంకో పురాణ కధకూడ ఉండి. లక్ష్మిదేవి అక్క జేష్టాదేవి ఈ చేట్టు మొదల్లలో అంటే వేరులలో విష్ణుదేవుని ఆజ్ఞ ప్రకారం నివాసమై ఉంది.ఈ దేవతనే దరిద్రలక్ష్మి అని అంటారు.చెట్టును తాకుతే జ్యేష్టాదేవి పట్టుకుంటుంది అని ఒక గ్రామీనులు విశ్వస్తారు.దీనికి సైంటిఫిక్ కారణం పైన తెలుసుకున్నాం.ఆధ్యాత్మీకంగా చూసినా,వైజ్ఞానికంగా చూసిన అసలు చెట్టును తాకరాదనే తెలుస్తుంది.విజ్ఞతతో ఆలోచించి ప్రవర్తిసే ఆరోగ్యంతో కూడిన సౌఖ్యం కలుగుతుంది.

మహిమాన్వీతమైన ఈ చెట్టు లేనిదే దేశంలో ఆంజనేయ స్వామి గుడి ఎక్కడా ఉండదు. మన పూర్వీకులన ఋషులు వారి తప: శక్తితో అనుభవపూర్వకమైన ప్రయోగాల ద్వారా గ్రహించి మనకు వారి అమూల్యమైన సూచనలు ఇచ్చారు.అర్ధం చేసుకుని ఆచరించిన వారికి అన్ని మంచే జరుగుతాయి.

English summary
The Astrologer told about the story about reason for worship of Sacred fig.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X