సత్యదేవ్‌ 'రావు బహదూర్‌' టీజర్‌ రిలీజ్.. ఊహకందని ప్రపంచం..!

టాలీవుడ్ లో విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో సత్యదేవ్.. గతేడాది కింగ్డమ్ తో హిట్టు కొట్టిన ఆయన ఇప్పుడు ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నారు. సత్యదేవ్ నటిస్తున్న 'రావు బహదూర్' సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి 'జస్ట్ ఏ టీజర్' పేరుతో టీజర్ రిలీజైంది. టీజర్ లో రాజసం ఉట్టిపడే పాత్రలు, విజువల్స్ తో ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.

Satyadev Rao Bahadur Teaser Released Get Ready to Step Into an Unimaginable World Satyadev

ఇక రావు బహదూర్ పాత్రలో సత్యదేవ్ జీవించారనే చెప్పాలి. ఈ చిత్రాన్ని వెంకటేశ్ మహా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆయన మొదటి చిత్రం కేరాఫ్ కంచరపాలెం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా తీశారు. తాజాగా ఇది మూడో చిత్రం కావడంతో ఈ సినిమాను మరింత పకడ్బందీగా తెరకెక్కించారు.

ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్‌ గా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ సహా మిగిలిన పనులను పూర్తి చేసుకుంది చిత్ర బృందం. ఇక 'రావు బహదూర్' సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి స్మరణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్‌ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+