కొత్త సంవత్సరంలో ఇల్లు, కారు కొనే రాశులవారు వీరే!
ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా సొంతిల్లు, కారు కొనాలని ఆశిస్తుంటారు. భూమిని కొనుగోలు చేయాలని, ఇల్లు కట్టుకోవాలని కలలు కంటుంటారు. అయితే కొత్త సంవత్సరంలో కొన్ని రాశులవారికి ఇల్లు, వాహన యోగం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కలలను వీరు కష్టపడితే సాకారం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వీరి కోరికలు నెరవేతాయని చెబుతున్నారు.
2024 మిశ్రమ సంవత్సరమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాదిలో శని తిరోగమనంలో ఉంటాడు. దీనివల్ల కర్కాటక, వృశ్చిక రాశి వారిపై శని ధైయా ప్రభావం ఉంటుంది. మకర, కుంభ, మీన రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇంటిని లేదంటే స్థలాన్ని, వాహనాన్ని కొనుగోలు చేయాలంటే... సంబంధిత జాతకులపై బృహస్పతి, అంగారకుడి అనుగ్రహం ఉండాలి.

కొత్త సంవత్సరంలో కొన్ని రాశులవారికి బృహస్పతి, అంగారకుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లోను తమ కోరికను నెరవేర్చుకుంటారని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా వాహనం కోసం చూస్తున్న కర్కాటక రాశివారి కల కొత్త సంవత్సరంలో నెరవేరబోతుందంటున్నారు. అలాగే వారికి ఆరోగ్యం ఎంతో బాగుండటంతోపాటు ధన లాభం ఉంది. కన్యా రాశితో పాటు తులా రాశి వారు ఇంటితో పాటు వాహనం కూడా కొనుగోలు చేస్తారు. ప్రధానంగా వచ్చే ఏడాది తులా రాశి వారికి ఎంతో బాగుంటుంది. గతంలో మొదలై మధ్యలోనే నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ వారు పూర్తిచేస్తారు. అంతేకాదు.. వైవాహిక జీవితంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి.












Click it and Unblock the Notifications