పితృ దోష నివారణకు ఇదే సమయం.. పితృపక్షంలో చెయ్యాల్సినవి ఇవే!
పూర్వీకులకు అంకితం చేయబడిన సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని పితృ పక్షం అంటారని సనాతన ధర్మాన్ని ఆచరించేవారంతా చెప్తారు. పూర్వీకులు తమ వారిని కలవటం కోసం పితృపక్షం సమయంలో భూమి మీదకు వస్తారని చెప్తారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెప్తారు.
తెలిసీ తెలియక చేసిన తప్పులతో పితృదోషాలు
అయితే కొంత మంది జీవితాలలో తెలిసీ తెలియక చేసిన తప్పుల కారణంగా పితృ దోషం వస్తుంది. అయితే ఇలాంటి హానికరమైన దోషాలు పితృపక్షం నివారణ చేసుకోవచ్చని అందుకు కొన్ని నివారణలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ సంవత్సరం పితృ పక్షాలు సెప్టెంబర్ 18 న ప్రారంభమై, అక్టోబర్ 2 న ముగుస్తుంది. ఈ సమయంలో పితృ దోషాలు ఉన్నవారు దోషాల నివారణకు తప్పకుండా ఈ పనులు చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

పితృపక్షంలో చెయ్యాల్సినవి ఇవే
పితృ పక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి, వారిని ప్రసన్నం చేసుకోవటానికి చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే.. పితృపక్షం సమయంలో తప్పనిసరిగా స్నానం, దానం, తర్పణం చేయాలని చెప్తారు. ఈ సమయంలో పిండదానం చేస్తే నిస్సందేహంగా పూర్వీకుల దీవెనలు అందుతాయని చెబుతున్నారు. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రార్డ కార్యక్రమం చేసి పిండదానం చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయని చెబుతున్నారు.
ఇవి చేస్తే పితృదోషం నుండి విముక్తి
ఇక పితృపక్షం సమయంలో పితృదోష పరిహారం కావాలని భావించే వారు మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని హనుమంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తే పితృ దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. వీలైతే సోమవారం నాడు ఉపవాసం ఉండి, ఆకలితో ఉన్నవారికి, పేదలకు ఆహారాన్ని ఇస్తే పితృ దోషాలు తొలగిపోతాయని చెపుతున్నారు. పితృ పక్షం సమయంలో పెద్దలను గౌరవించాలని, ఎట్టి పరిస్థితులలోను వారిని అగౌరవపరచ వద్దని చెబుతున్నారు.
పితృదోషం నివారించేందుకు ఈ పనులు చెయ్యాలి
ఇంటికి వచ్చిన అతిథులను, యాచకులను అవమానించకుండా వారికి ఆహారాన్ని ఇస్తే కూడా పితృ దోషాలు తొలగిపోతాయని, పౌర్ణమి రోజున గంగలో స్నానం చేసి పూర్వీకుల పేరిట హవనం చేస్తే కూడా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు శుభకార్యాలు చేసే ముందు పూర్వీకులను స్మరించుకోవాలని, .జంతువులు, పక్షులకు ఆహారాన్ని, నీటిని ఇస్తే పితృ దోషం తొలగిపోతుందని చెబుతున్నారు. మంగళవారం నాడు వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేస్తే పితృ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications