వాస్తు ప్రకారం ఇంట్లో శక్తిని పెంచే మార్గాలు ఇవే!
ఇంటి నిర్మాణాన్ని మనం వాస్తు చూడకుండా నిర్మించడం. ఇది కచ్చితంగా చేస్తాం. అయినా ఏదో ఒక చికాకు కలుగుతూనే ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు.. అనారోగ్యం విషయంలో కావచ్చు. ఆ సమయంలో నిపుణులను సంప్రదిస్తే వాస్తు దోషాలున్నాయని చెబుతారు. దాంతో మనం కొన్ని మార్పు చేర్పులు చేస్తాం. ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల శక్తులు లేకుండా సానుకూల శక్తులు ఉండాలని, పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు నిండాలని అందరూ అనుకుంటారు.
అందుకు తగిన మార్గాలు కూడా ఉన్నాయి. ఇంటిని వాస్తు దోషాలు లేకుండా శుభ శక్తులతో నింపే సూచనలను వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. వాటిగురించి తెలుసుకుందాం.అనుసరిస్తుండవచ్చు. మీ ఇంటిని శుభ శక్తులతో నింపేందుకు ఈ వాస్తు సూచనలను తప్పకుండా పాటించండి.

వాస్తు శాస్త్రం మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. సమస్యలనేవి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయా? లేదంటే మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? అనేవి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఒక్కోసారి తెలియకుండా, నిర్లక్ష్యంతో వాస్త నియమాలను ఉల్లంఘిస్తుంటాం. కానీ వాస్తును దృష్టిలో ఉంచుకోవడం అనేది మాత్రం కచ్చితంగా చేయాలి. లేదంటే జీవితంలో కొన్నిప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో శుభ శక్తులు ఉండాలంటే ఇల్లు వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. లోపలి ఏర్పాట్లన్నీ అలాగే ఉండాలి. కానీ చాలామంది వీటిని ఉల్లంఘిస్తుంటారు. దీంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉండకూడదు.
అభివృద్ధి కూడా నిలిచిపోతుంది.
జీవింలో సమస్యలు తలెత్తుతాయి.
గడియారం పనిచేయకపోతే రిపేరు చేయించాలి.
ఇంటి ప్రధాన తలుపు ముందు చెప్పులు, షూలు ఉంచకూడదు.
ప్రతికూల శక్తులకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.
చెప్పులు, షూలు ఒక పక్కగా విడవండి.
మంచం ముందు అద్దం ఉంటే వెంటనే తొలగించండి.
అలా అద్దం ఉంటే పీడకలలతోపాటు నిద్ర లేమి ఉంటుంది.
ప్రతికూల శక్తులకు ఆస్కారం ఏర్పడుతుంది.
ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయి.
మంచం ముందు ఎప్పుడూ అద్దం ఉంచకూడదు.
వాస్తు ప్రకారం వంటగది, బాత్ రూం ఒకే గోడకు ఆనుకొని ఉండకూడదు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
కుటుంబ సభ్యులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
నిద్రించే సమయంలో తల ఉత్తరం వైపు ఉండకూడదు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
మీ శక్తిని తగ్గిస్తుంది.
ఇతర దిక్కుల్లో నిద్రించడం ఉత్తమం.












Click it and Unblock the Notifications