కొద్దిరోజులు ఓపిక పట్టండి.. దీపావళి తర్వాత ఈ రాశులవారే కుబేరులు!
దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత శనిదేవుడు, రాహువు సంచారం జ్యోతిష్యం ప్రకారం అత్యంత కీలకమైందని పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉన్నవారికి అంతులేని అదృష్టం రాబోతోంది. రాహువు అంటే ఛాయాగ్రహం. అందరూ కీడు చేస్తుందని భయపడతారు. కానీ రాహువు కూడా మేలు చేస్తాడనే విషయాన్ని తెలుసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ధన ప్రవాహం పెరుగుతుందని, జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారని తెలియజేస్తున్నారు.
కుంభ రాశి
వీరు చేపట్టే ప్రతి పనిలోను విజయాన్ని అందుకుంటారు. జీవితంలో తలెత్తే ప్రతి సమస్యను ఎంతో చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. అనుకోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా గతంలోకంటే బలపడతారు. రాహువును పూజించడంతోపాటు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంవల్ల ఎంతో మంచి జరుగుతుంది. అదృష్టం కలిసివచ్చు అందలం ఎక్కుతారు.

తులా రాశి
ఈ రాశివారికి ఇది చాలా అదృష్ట సమయం. అంతేకాదు.. గతంలో మీరు ఎవరి దగ్గరైతే డబ్బులు తీసుకున్నారో వారికి తిరిగి చెల్లించేస్తారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. చేస్తున్న పనిలో మీరు చూపించే శ్రద్ధకు గౌరవం పెరుగుతుంది. అలాగే మంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు తీర్థయాత్రలకు వెళతారు. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు.
మకర రాశి
ఒకరకంగా వీరికి దీపావళి తర్వాత జాక్ పాట్ తగులుతుందని చెప్పొచ్చు. డిసెంబరు నుంచి వీరికి తిరుగులేదు. అంతులేని లాభాలను అందుకుంటారు. వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతమైన లాభాలను వ్యాపారస్తులు గడిస్తారు. వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్థులకు ఇబ్బందులున్నప్పటికీ, వారు కోరుకున్న చోటకు బదిలీ అవనప్పటికీ ఇబ్బంది లేకుండా ఆదాయం పెరుగుతుంది.












Click it and Unblock the Notifications