కుబేరుడు చాలా ఇష్టపడే రాశులు వీరే.. లక్ష్మీదేవి కనక వర్షం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు కొన్ని రాశులంటే ఇష్టం ఉంటుంది. వాటిపై ఎల్లప్పుడూ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాయి. అలాగే కుబేరుడికి కూడా కొన్ని ఇష్టమైన రాశులు ఉంటాయి. ఆయన ఆశీర్వాదం ఉంటే వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కోరికలన్నీ చాలా సులువుగా నెరవేర్చుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే కోటీశ్వరలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుబేరుడు ఇష్టపడే రాశులు ఉంటి? వాటికి ఎలా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

ధనస్సు రాశి
అన్నిరకాలుగా భౌతిక సుఖాలను, సౌకర్యాలను పొందుతారు. డబ్బును పొదుపు చేస్తారు. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుబేరుడి ఆశీర్వాదం పొంది జీవితంలో ఇంతవరకు కళ్లచూడని డబ్బును చూస్తారు. నిజాయితీగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండటం వీరికి వరం. శ్రమించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ధనలాభం విపరీతంగా ఉంది.

These are the zodiac signs that lord Kubera loves the most Goddess Lakshmi blessings

తులారాశి
ఈ రాశిలో జన్మించినవారికి ఎప్పుడూ కుబేరుడి అనుగ్రహం లభిస్తుంటుంది. దీనివల్ల వీరికి ధనలాభాలుంటాయి. సమాజంలో గౌరవాన్ని పొందడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కోరుకున్న కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటారు. అందరితో ఎంతో ప్రేమగా, సహనంతో వ్యవహరిస్తారు.

వృషభ రాశి
వీరు కోటీశ్వరులయ్యేంతవరకు కష్టపడుతూనే ఉంటారు. అందుకు కుబేరుడి నుంచి కూడా ఆశీస్సులు లభిస్తుంటాయి. డబ్బు సంపాదనలో మునిగిపోతారని చెప్పొచ్చు. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఊహించనిరీతిలో లాభాలుంటాయి. కేవలం కోట్లు సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా వీరు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అందుకు అదృష్టం కూడా కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+