రాఖీ రోజు ఇలా చేయండి... ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం
రక్షా బంధన్ ఈ ఏడాది సోమవారం వచ్చింది. అదేరోజు శ్రావణ సోమవారం. శ్రావణ పౌర్ణమి. దేశవ్యాప్తంగా ఈ పండగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధం బలపడటానికి, అన్యోన్యత పెంచడానికి రాఖీ పండగ ఉపయోగపడుతుంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఆనందాన్ని కలిగించి శ్రేయస్సును పెంచుతుంది. రాఖీ రోజు బ్లూమూన్ ఏర్పడుతుండటంతో నాలుగు రాశులవారికి బాగా కలిసివస్తోంది. మకర రాశి, కుంభ రాశి, ధనుస్సు రాశి, మేషరాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.
రాఖీ రోజు చేయాల్సిన కొన్ని పరిహారాలుంటాయి. అవి చేయడంవల్ల సంపద కలిసివస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు.. ఎవరిచేత అయితే రాఖీ కట్టించుకుంటారో వారి భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ పరిహారాన్ని సోదరీమణులు చేయాలి.

వినాయకుడికి రాఖీ
రాఖీ పర్వదినం రోజు ముందుగా విఘ్నేశ్వరుడికి రాఖీ కట్టి తర్వాత సోదరుడికి కట్టాలి. ఇలా చేయడంవల్ల సోదర సోదరీమణుల మధ్య ప్రేమ పెరుగుతుంది. వారి జీవితంలో సంతోషం వెల్లివిరయడంతోపాటు శ్రేయస్సు చేకూరుతుంది.
అడ్డంకులు తొలగిపోవడానికి
సోదరీమణుల పురోగతిలో ఆటంకాలు ఎదురవుతుంటే రాఖీ రోజు ఖీర్ పరిహారం చేయాలి. ముందుగా లక్ష్మీదేవిని పూజించి, ఆడపిల్లలకు పొంగలి పంచడంవల్ల వృత్తిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.
సంపద కోసం
సోదరి తన సోదరుడికి అక్షింతలు, తమలపాకులు, వెండి నాణెం కలిపి గులాబీ బుట్టలో వేసి ఇవ్వాలి. ఇలా చేసిన తర్వాత సోదరుడు వాటిని జాగ్రత్తగా దాచుకుంటే ఎప్పటికీ ధనానికి కొరత రాదు.
సంతోషం, శ్రేయస్సు కోసం
రాఖీ పండగ రోజు ఆహారాన్ని దానం చేయాలి. ముక్కోటి దేవతలు నివసించే ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే ఎంతో మంచిది. దీనివల్ల జీవితంతో శాంతి, శ్రేయస్సు కలుగుతాయి.












Click it and Unblock the Notifications