వచ్చే నెలరోజులు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే

జ్యోతిషం ప్రకారం చరరాశుల్లో ఉన్నప్పుడు శుభగ్రహాలకు బలం చేకూరుతుంది. అవి చురుకుగా, వేగంగా మంచి ఫలితాలనిస్తాయి. మేషం, కర్కాటకం, తుల, మకర రాశులను చర రాశులంటారు. ఈ రాశులవారికి ఈ నెలరోజుల్లో గురు, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు పూర్తిస్థాయిలో ఫలితాలనిస్తాయి. అయితే ఇదంతా వారు చేసే ప్రయత్నాలమీదే ఆధారపడివుంటుంది. అయితే ఏ పనిచేపట్టినా విజయం చేకూరుతుంది. ఈ రాశులవారికి ఏ విధంగా మేలు కలుగుతుందో పరిశీలిద్దాం.

మేష రాశి:వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. వీరికి అదృష్టం కలిసివస్తుంది. గురు, బుధ, శుక్ర, చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ఈ రాశివారి ప్రయత్నాలన్నీ విజయాన్నిస్తాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు శరవేగంగా ఉత్తమ ఫలితాలనిస్తాయి. ఉద్యోగం విషయంలో విదేశాలకు వెళతారు. సాంకేతిక నిపుణులకు పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి.

these zodiac people are very lucky coming 30 dasy

కర్కాటక రాశి:గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుంది. సొంత ఇల్లు కొనాలనుకునేవారి కోరిక తీరుతుంది. ఉద్యోగ జీవితంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబ సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కన్సెల్టెన్సీ, జూదం, లాటరీ, షేర్లు, వడ్డీ వ్యాపారం లాంటివి పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి.

తులా రాశి:ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థికంగా కలిసి రావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా అది సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తుంది. ఎదుటివారికి సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ స్థానంలో శుక్రుడున్నాడు. అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులు మంచి కంపెనీల్లో స్థిరపడతారు.

మకర రాశి:ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా సుఖ సంతోషాలుంటాయి. ఆశించినదానికన్నా ఎక్కువ గుర్తింపు ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతితోపాటు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వర్తమానంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+