శుక్రవారం ఇలా చేయండి.. లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది!

లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా కొత్తగా సంపద కూడా వస్తుంది. లక్ష్మీదేవిని పూజించేందుకు రాత్రి సమయం పవిత్రమైనది. శుక్రవారం రోజు రాత్రి 9.00 గంటల నుంచి 10.00 గంటల మధ్యలో ఆ తల్లిని పూజించాలి. శుభ్రంగా ఉతికిన దుస్తులను ధరించి, ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫొటో లేదంటే విగ్రహాన్ని, దాంతోపాటు శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యితో దీపాన్ని వెలిగించిన అనంతరం అష్ట గంథాన్ని శ్రీ యంత్రం, లక్ష్మీ దేవికి తిలకంగా పెట్టాలి.

హిందూ మతాచారం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి, లేదంటే కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే శుక్రవారం రోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం అనేది సంపదకు దేవత అయిన ఆ తల్లికి అంకితం చేయబడుతుంది. ఇంట్లో సంపద, సంతోషం, శ్రేయస్సు కోసం శుక్రవారం లక్ష్మీ పూజ చేయాలి. మొత్తం 12 రాశుల్లో నాలుగు రాశులను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. సిరిసంపదలు, ఐశ్వర్యం ఎల్లప్పుడూ వీరితోనే ఉంటాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

these zodiac sigh people are very lucky due to goddess lakshmi devi favorites
మీనరాశి : వీరు ఎంతో ప్రేమ మనస్తత్వాన్ని కలిగివుంటారు. తమతోపాటు ఇతరులను కూడా వీరు అదృష్టవంతులుగా భావిస్తారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడే సంపద, ఆనందం ఉంటాయి. కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

ధనస్సు : ధనస్సు రాశికి గురువు అధిపతి. ఈ గ్రహం ప్రభావం వల్ల సంపదను పొందుతాడు. ధనస్సు రాశివారు అదృష్టవంతులుగా పరిగణించబడతారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ రాశి అమ్మాయిలకు లక్ష్మీదేవి విశేషమైన కృప లభిస్తుంది.

కర్కాటక రాశి : అమ్మాయిల అదృష్టం బలంగా ఉంటుంది. వీరివల్ల కుటుంబం ఆనందంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జీవితంలో దేనికీ లోటు ఉండదు.

వృషభ రాశి : ఈ రాశివారు కష్టజీవులు.. అదృష్టవంతులు. తెలివైనవారు. శ్రమతో విజయం సాధిస్తారు. కుటుంబంలో వీరికి ప్రత్యేకంగా గౌరవం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+