మహా పురుష రాజయోగంతో ఈ రాశులపై కుబేరుడి కుంభవృష్టి
శని దేవుడిని న్యాయ దేవతగా పరిగణిస్తారు. మన కర్మలను బట్టి ఫలాలు ఇస్తుంటాడు. ఆయన అనుగ్రహం ఉంటే అందరికీ శుభం కలుగుతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనికి మరో రెండు గ్రహాలు సూర్యుడు, బుధుడు జత కలవనున్నారు. దీనివల్ల విశేషమైన శశ మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం కొన్ని రాశులవారి కష్టాలను దూరం చేయడమే కాకుండా ఆర్థికంగా బలపడేలా చేస్తుంది.
కన్య రాశి
ఈ రాశివారికి శశ మహాపురుష యోగం బాగా కలిసివస్తుంది. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. పనిచేసే రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేస్తారు. వ్యాపారస్తులపై శనిదేవుడి ప్రత్యేక ప్రభావం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

కర్కాటక రాశి
శని వ్యాపారంలో మార్పును తెస్తుంది. వ్యక్తిగత జీవితంపై మంచి ప్రభావం కలుగుతుంది. లాభాదాయకంగా కెరీర్ సాగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు మంచి ఆఫర్లున్నాయి. ఆర్థికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. శ్రమతోనే విజయాన్ని దక్కించుకుంటారు.
మేషరాశి
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఒప్పందం కుదురుతుంది. ఆర్థిక సంక్షోభం తీరిన తర్వాత లాభపడతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చికరాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మాటలు అందరినీ ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ప్రజలంతా సంతోషిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనితీరు కూడా మెరుగుపడుతుంది. కలలన్నీ నిజమవుతాయి. ఏ పని తలపెట్టినా అంచలంచెలుగా విజయం సాధిస్తారు.
సింహరాశి
శశ యోగం మంచి ఫలితాలను కలిగిస్తుంది. మీపై మీకు పూర్తి నమ్మకం ఉండాలి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది.












Click it and Unblock the Notifications