బుధుడి సంచారం: ఈ రాశులవారికి లాభాలే లాభాలు

జ్యోతిష్యం ప్రకారం బుధుడు శుభ ఫలితాలనిచ్చేవాడిగా పరిగణిస్తారు. బుధ సంచారం అన్ని రాశులకు సానుకూల ఫలితాలనే ఇస్తుంది. అక్టోబర్ 19 ఉదయం 1:16 గంటలకు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం వల్ల 12 రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 22న స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. వీటివల్ల కొన్ని రాశులవారు ఊహించనిరీతిలో ఫలితాలను పొందుతారు. ఏయే రాశులవారి జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

మిథున రాశి : ఈ రాశిని బుధుడు పరిపాలిస్తాడు. గతంలో నిలిచిపోయిన డబ్బులు సులభంగా తిరిగి వస్తాయి. ఇదే సమయంలో వాహనం, భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా వీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.

these zodiac sign people are un lucky due to Budh Rashi Parivartan 2023

కన్యారాశి : వీరికి శుభ ఫలితాలున్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. కష్టపడి పనిచేయడంవల్ల ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల అనుబంధాలు మరింత బలోపేతమవుతాయి.

ధనుస్సు రాశి : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఊహించనిరీతిలో ఫలితాలను పొందనున్నారు. ఉద్యోగస్తులకు ఎంతో ప్రయోజనం. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలతో చేసే పనిలో సంపూర్ణ విజయం సాధిస్తారు.

మకర రాశి : తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే పూర్వీకుల ఆస్తిని పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత సమయం వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+