చంద్ర గ్రహణంతో ఈ రాశులవారిపై తీవ్ర వ్యతిరేక ప్రభావం
ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి శరద్ పూర్ణిమ మరుసటి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28వ తేదీన వచ్చింది. పౌర్ణమి రోజు గంగా స్నానం చేయడం వల్ల పాపాలన్నీ పోతాయి. శరద్ పూర్ణిమ రోజు ఈ ఏడాదిలో చివరిదైన చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మనదేశంలో కనిపిస్తుండటంతో సుతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది.
ప్రతికూలతే ఎక్కువ
చంద్ర గ్రహణం సమయంలో రాహువు ప్రభావం పెరగడంవల్ల రెండు రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మనదేశ కాలమాన ప్రకారం శరద్ పూర్ణిమ అర్ధరాత్రి 1:06కి ప్రారంభమై 2:22కి ముగుస్తుంది. పూర్ణిమ తిథి రాత్రి 1:53 గంటలకు ముగుస్తుంది. అంటే చంద్రగ్రహణం వ్యవధి 1 గంట 16 నిమిషాలు. దీనివల్ల రెండు రాశులవారు తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి
అక్టోబర్ 28వ తేదీ ఉదయం 7:31 గంటలకు చంద్రుడు మీన రాశి నుండి బయటకు వెళ్లి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. 30వ తేదీ ఉదయం 10.28 గంటల వరకు అక్కడే ఉంటాడు. గ్రహణ సమయంలో చంద్రుడు ఈ రాశిలోని లగ్న గృహంలో ఉంటాడు. ఈ ప్రభావంతో ఈ రాశులవారిని మానసిక సమస్యలు వేధిస్తాయి. మాటలను కూడా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. భావోద్వేగానికి గురై నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరులతో గొడవలవుతాయి.
కర్కాటక రాశి
ఈ రాశికి అధిపతి చంద్రుడు. గ్రహణ సమయంలో ఈ రాశివారు తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడంవల్ల మేలు కలుగుతుంది.












Click it and Unblock the Notifications