చంద్ర మంగళ యోగంతో కోటీశ్వరులవుతారు.. మీది ఏ రాశి?

చంద్ర మంగళ యోగం పట్టినవారు ధనాన్ని ఎక్కడ దాచిపెడతారో ఎవరూ చెప్పలేరు. అంతలా కలిసివస్తుందన్నమాట. ఈ నెల 19, 20, 21 తేదీల్లో కన్యా రాశిలో కుజ, చంద్రులు కలిసి ఉండటంవల్ల ఈ విచిత్ర ధన యోగం ఏ రాశివారికి పట్టబోతోందో తెలుసుకుందాం.

మేషం: గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల బాగా కలిసివస్తుంది. రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారు.

వృషభం: షేర్లు, పొదుపు, స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాల్లాంటివాటితో సంపాదన పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అధి డబ్బును తీసుకొస్తుంది.

these zodiac sign people are very lucky due to chandra mangala Yoga

మిథునం: డబ్బు సంపాదించాలనే ఆరాటం పెరుగుతుంది. అవినీతి, పైరవీలు కలిసివస్తాయి. స్థలాలు, పొలాలపై పెట్టుబడి పెడతారు.

కర్కాటకం: తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. డబ్బు సంపాదన కోసం అవినీతి, అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడతారు.

సింహం: ఇంట్లోనే డబ్బును దాస్తారు. రహస్య కార్యకలాపాలు పెరగడంతోపాటు ఒప్పందాలు కూడా జరుగుతాయి.

కన్య: లాభం లేనిదే ఏ పనీ చేయరు. సంపదను స్థిరాస్తుల రూపంలోకి మారుస్తారు. స్పెక్యులేషన్, వడ్డీ వ్యాపారం, జూదాలవంటివాటిపైకి దృష్టి మళ్లుతుంది.

తుల: మూడో కంటికి తెలియకుండా డబ్బును దాస్తారు. బ్లాక్ మనీకి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సఫలమవుతాయి. వడ్డీకి తిప్పడం, రహస్యంగా దాయడం జరుగుతుంది.

వృశ్చికం: సంపాదన పెరుగుతుంది. స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరుగుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులద్వారా డబ్బును సంపాదిస్తారు.

ధనుస్సు: కొత్త ప్రయత్నాలద్వారా సంపాదన పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడతారు. బినామీ పేర్లతో డబ్బును దాస్తారు.

మకరం: చిట్స్ మీద పెట్టుబడి పెడతారు. అక్రమ వ్యాపారాలతోపాటు బ్లాక్ మనీ వ్యవహారాలుంటాయి. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాలతోపాటు రాజకీయ నాయకులు కూడా కుబేరులవుతారు.

కుంభం: వృత్తి, వ్యాపారాల్లో రహస్యంగా డబ్బును దాస్తారు. రహస్యంగా మదుపు చేస్తారు. అయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా తక్కువగా జరుగుతుంది.

మీనం: డబ్బు సంపాదనకు అవినీతి, అక్రమాలకు పాల్పడతారు. జీవిత భాగస్వామిద్వారా డబ్బు సంపాదన పెరుగుతుంది. సంపద పెంచుకునే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+