వృషభరాశిలోకి బృహస్పతి.. ఈ రాశులపై కనక వర్షం

దేవ గురువైన బృహస్పతి ఈనెల 30న మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం ఆరు రాశులపై ఉంటుంది. బృహస్పతి సంచారంతో కర్కాటకం, సింహంతో సహా ఆరు రాశుల వారు అపారమైన విజయాన్ని పొందుతారు. అదే సమయంలో ఒక రాశికి బంపర్ ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి సంచారంతో, ఈ రాశుల వారి వృత్తిలో స్థిరత్వం లభించడంతో పాటు వారి ఆదాయం పెరుగుతుంది. గురువు వృషభ రాశిలో 2025 మే 14 వరకు సంచరిస్తాడు. గురుదేవుడి సంచారం వల్ల అపారమైన లాభాలను పొందే రాశుల వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగ అవకాశాలు సఫలీకృతమవుతాయి. వేతనం కూడా పెరుగుతుంది. జీవితంలో వృద్ధి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. డబ్బును వృథాగా ఖర్చుపెట్టకుండా పొదుపు చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. తెలివితేటలతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

these zodiac sign people are very lucky due to guru gochar 2024 jupiter transit

మేషరాశి
కొత్త ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆశించిన విధంగా వేతనం పెరుగుతుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరగడంతోపాటు డబ్బుకు సంబంధించిన విషయాలపట్ల జాగ్రత్త వహించాలి. నచ్చిన ఉద్యోగం వస్తుంది. సంతాన ప్రాప్తి ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభ రాశి:
కెరీర్ పరంగా అడ్డంకులు తొలగిపోతాయి. గురుడి సంచారం వీరిని సంతోషపరుస్తుంది. సంపాదనకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

కర్కాటక రాశి
ఆదాయం పెరగుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలను పొందుతారు. మంచి రాబడి అందిస్తుంది. ఆర్థిక లక్ష్యాలను పెట్టుకున్నారో వాటిని చేరుకుంటారు.

సింహరాశి
వ్యాపారంలో ఆర్డర్లు ఉన్నాయి. ఉద్యోగంలో పురోగతి వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. వేతనం పెరుగుదలతోపాటు ప్రమోషన్ కు అవకాశం ఉంది. పై అధికారులతో సత్సంబంధాలుంటాయి. పూర్వీకుల నుంచి ఆస్తి ద్వారా ప్రయోజనాలు అందుకుంటారు.

వృశ్చిక రాశి
వ్యాపారంలో లాభాలున్నాయి. మంచి ఆర్థిక ప్రయోజనాలున్నాయి. భాగస్వాముల ద్వారా లాభం ఉంటుంది. కెరీర్ పరంగా సమస్యలు పరిష్కారమవుతాయి. స్థిరత్వాన్ని పొందుతారు. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే జీవితంలో పురోగతి సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+