కొత్త సంవత్సరంలో లగ్జరీ లైఫంటే వీరిదే
కొత్త ఏడాది రాబోతోంది ఈ ఏడాదిలో గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ప్రధానంగా శని రెండున్నర సంవత్సరాలపాటు ఒకే రాశిలో ఉండనున్నాడు. త్వరలో జరగబోయే శని గ్రహం సంచారం కారణంగా సాడే సతి ఏర్పడుతుంది. ఈ సంచారం కొన్ని రాశులవారికి అనేక ప్రయోజనాలను కల్పించనుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
తులారాశి: వీరికి అదృష్టం తోడుంటుంది. దీనికి ప్రధాన కారణం శని. ఏ పనిలోనైనా శ్రమ లేకుండా విజయాలు సాధిస్తారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు శుభవార్తలను వింటారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది. ఎంత కష్టపడితే అంత శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.

కుంభ రాశి: శని అనుగ్రహంతో ఉద్యోగాల్లో ఊహించని లాభాలుంటాయి. తోటి ఉద్యోగుల నుంచి, సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం తగదు. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
వృషభ రాశి: కష్టాలన్నీ సులువుగా దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి మంచి శుభవార్తలను వింటారు. కుటుంబ సభ్యులమధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. తద్వారా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాల్లో కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications