కుజుడు, కేతువు కలయికతో ఈ రాశులవారికి ధనవర్షం
కుజుడు, కేతువు స్నేహపూర్వక గ్రహాలు. వీటిమధ్య అనుబంధం బాగుంటుంది. భౌతిక జీవనంలో విజయాలు సాధించేందుకు కేతువు తోడ్పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే ప్రత్యేక యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. తులారాశిలో కుజుడు, కేతువు ఈనెల మూడోతేదీన కలిశారు. ఈ ప్రభావం అక్టోబర్ 30వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కన్య రాశి
కుజుడు-కేతువు కలయిక కన్య రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. అకస్మాత్తుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మాటతీరు మెరుగుపడుతుంది. దీనివల్ల మంచి జరుగుతుంది. మీడియా, మార్కెటింగ్, విద్య రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయంలో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

తుల రాశి
వీరి వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. పూర్తి సానుకూల వైఖరిని కనపరుస్తారు. ఎటువంటి పనులు చేపట్టినా, ఏ రంగంలోకి అడుగు పెట్టిన విజయం వీరి సొంతమవుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు.. ఇద్దరికీ విజయాలున్నాయి. భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
కుంభ రాశి:
అదృష్టం వీరికి తోడుంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. గతంలో మొదలై పూర్తవకుండా అలాగే పెండింగ్ లో ఉండిపోయిన పనులన్నీ సులభంగా పూర్తిచేస్తారు. డిగ్రీలు పూర్తిచేసుకున్న విద్యార్థులు కూడా సులభంగా ఉద్యోగాలు పొందుతారు. విదేశీ ప్రయాణం ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు సంపూర్ణంగా లభించడంవల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications