కన్యారాశిలోకి కుజుడు.. ఈ రాశులకు సంపదే సంపద
గ్రహాలకు సేనాధిపతి లాంటి కుజుడు సాహసం, పరాక్రమం, వివాహం వంటి అంశాలకు కారకుడిగా పరిగణిస్తారు. ఈనెల 18వ తేదీన మంగళ గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించనుంది. దీనివల్ల 5 రాశులవారికి విశేష ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. ధనయోగం బాగుంటుంది. అదే సమయంలో గ్రహాలకు యువరాజు లాంటి బుధుడు కూడా కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయికవల్ల యుతి ఏర్పడనుంది. దీనివల్ల లబ్ధి పొందబోయే రాశుల వివరాలు తెలుసుకుందాం.
కర్కాటక రాశి: కుజుడి సంచారం ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని చూసి వారి ఓటమిని అంగీకరిస్తారు. ఊహించనిరీతిలో ధనయోగం ఉంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు ఆరోగ్యం బాగుంటుంది.

ధనస్సు రాశి: వ్యాపారస్తులకు విస్త్రత లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ వస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఏర్పడవు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఏ పని తలపెట్టిన జీవిత భాగస్వామికి చెప్పి సలహా తీసుకొని పనిచేస్తే విజయం సాధిస్తారు.
మేష రాశి: ఈ రాశివారికి విశేషమైన లాభాలున్నాయి. ఆవేశం కూడదు. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. ఊహించని మార్గాల నుంచి ధనలాభం ఉంటుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి పటిష్టమవుతుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయి. అవి వచ్చేంతవరకు ఎటువంటి వివాదాలకు పోకుండా సంయమనంతో వ్యవహరించాలి.
వృశ్చిక రాశి: వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పుల నుంచి విముక్తులవుతారు. రోగాలు తగ్గుతాయి. సమయం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థులు కూడా స్నేహితులవుతారు. బయట ఆదరణ పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న డబ్బులు చేతికందుతాయి.
మిథునరాశి: విశేషమైన లాభాలున్నాయి. కుటుంబంతో గడపడానికి సమయాన్ని వెచ్చిస్తారు. దేనికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబంలో సమస్య ఎదురైతే సంయమనంతో వ్యవహరించి పరిష్కరించుకోవాలి. కెరీర్ బాగుంటుంది.












Click it and Unblock the Notifications