డిసెంబరు 27 నుంచి ఈ రాశులకు ధనప్రాప్తి
జ్యోతిష్యంలో అంగారక గ్రహాన్ని అన్ని గ్రహాలకు గురువుగా భావిస్తారు. దీని సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది సంచారం చేసిన సమయంలో వ్యక్తుల జాతకంలో శుభ స్థానంలో ఉంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈనెల 27వ తేదీ రాత్రి 11.40 గంటలకు ధనుస్సు రాశిలోకి సంచరించబోతోంది. దీనివల్ల ఏయే రాశులవారికి మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారికి మంచి ఫలితాలున్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో లాభాలుంటాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

తులా రాశి
వీరికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. కోరుకున్న కోరికలన్నీ సులభవంగా నెరవేరడంతోపాటు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. వీరి ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారి జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడంవల్ల ఊహించని లాభాలు పొందుతారు. శుభవార్తలను వింటారు. గతం కంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ ఉంది. గతంలో ప్రారంభించి నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో సులువుగా పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications