సరిగ్గా 2 నెలలు ఆగితే ఈ రాశుల దశ తిరిగినట్లే
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు తక్కువలో తక్కువగా నెల సమయం తీసుకుంటాయి. ఒక్కోసారి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని కీలకమైన గ్రహాలు ఈ ఏడాదిలో రాశిని మార్చబోతున్నాయి. అత్యంత పాపిగా భావించే రాహువు గోచార సమయం కూడా దగ్గరపడింది. ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.
రాహువు గ్రహ గోచార ప్రభావం కీలకంగా ఉంటుంది. ఎవరి జన్మ కుండలిలో అశుభ స్థితి ఉంటుందో వారికి హాని జరిగే అవకాశం ఉంది. రాహువువల్ల చెడు సాంగత్యానికి అలవాటవుతారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా రాహువు చెడు ప్రభావం మాత్రమే చూపించదు.. నష్టాన్ని కలిగించదు. రాహువు బలమైన స్థితిలో ఉంటే అంతా శుభంగా జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు సంపూర్ణంగా లభిస్తాయి.

అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు మేష రాశి నుంచి మీన రాశిలోకి రాహువు గోచరిస్తాడు. మీనరాశిలోకి తిరోగమనం చేయనున్నాడు. రాహువు రాశి పరివర్తనం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపించినా మూడు రాశులకు మాత్రం అనేక ప్రయోజనాలను కలిగించనుంది.
మేష రాశి: వీరికి ధన లాభం కలుగుతుంది. ఏడాది చివరికి ఆర్థిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది. ఉద్యోగస్తులకు బాగుంది. వృద్ధి చెందడంతోపాటు గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. అక్టోబరు 30వ తేదీన ఈ రాశి నుంచే రాహువు మీనంలోకి మారతాడు.
కర్కాటక రాశి: ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలతోపాటు దాన్ని విస్తరిస్తారు. గతం నుంచి నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి. కోరుకున్న పనులన్నీ వేగంగా అవుతాయి.
మీనరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వేరేవారి దగ్గర ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.












Click it and Unblock the Notifications