ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్ తోపాటు పట్టిందల్లా బంగారమే
వ్యక్తి జాతకంలో శుభ స్థానానికి సంబంధించి ప్రత్యేక యోగం ఏర్పడితే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి లోటు ఏర్పడదు. రెండు రాశుల కలయిక ద్వారా ఈ యోగాలు ఏర్పడుతుంటాయి. అలాగే కొన్ని ముఖ్యమైన గ్రహాలు వాటి స్థితులను మార్చుకున్నప్పుడు కూడా ఇలాంటి యోగాలు ఏర్పడుతుంటాయి.
చంద్రుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయడంవల్ల సర్వార్ధ సిద్ధ రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం తక్కువ కాలం కాకుండా ఎక్కువ కాలం ఉంటుంది. ఈ సిద్ధ రాజయోగంవల్ల ఏయే రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం.

మిథున రాశి: వృత్తి జీవితంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. కష్టపడి పనిచేయడం వల్ల ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నవారి కోరిక నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు.
సింహరాశి: ఈ రాశి వారికి ఆంజనేయుడి అనుగ్రహం లభిస్తుంది. కఠినతరమైన పనుల్లో కూడా సులువుగా విజయాలు సాధిస్తారు. స్నేహితుల సపోర్ట్ లభించి ఆర్థికంగా బలపడతారు. మానసిక ప్రశాంతత కోసం విహారయాత్రలకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్థలకు పరిష్కారం లభిస్తుంది. అంతకుముందు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి.
కన్యా రాశి: ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఎటువంటి పనినైనా సులువుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో అనవసరమైన చర్చలను చర్చకు పెట్టకూడదు. ఒంటరిగా ఉండేవారికి బాగుంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో సులువుగా పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications