శనిదేవుడి దయతో ఈ రాశులవారికి కళ్లు చెదిరే అదృష్టం
జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడు న్యాయదేవత. అతను తిరోగమన స్థితిలో సొంత రాశిలోకి కదలనున్నాడు. నవంబరు 4వ తేదీన ప్రత్యక్షంగా కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. దీపావళికన్నా ముందునుంచే కొన్ని రాశులవారిపై ఈ ప్రభావం పడనుంది. శని గ్రహ ప్రభావం ఏయే రాశులవారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశివారికి శనిదేవుడి తిరోగమనం శుభప్రదంగా ఉంటుంది. శని అనుగ్రహం వల్ల ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారం చేసేవారు ఈ సమయంలో తమ వ్యాపారాలను విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శని తిరోగమం పాత స్నేహితులను కలుపుతుంది. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో సులభంగా ప్రారంభమై విజయవంతమవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

వృషభ రాశి: అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా ఎంతో లాభం కలుగుతుంది. శుభివార్తలు వింటారు. కుటుంబంతో ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.
మిథున రాశి: శని తిరోగమనంతో ఈ రాశి వారు ఆర్థికంగా బలోపేతమవుతారు. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
కర్కాటక రాశి: వృత్తిపరంగా ఎంతో అనుకూలత ఉంది. ఆర్థికంగా జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కుటుంబంతో అధిక సమయం సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications