30 ఏళ్ల తర్వాత... ఈ రాశులకు ఐశ్వర్యం
గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తుంటాయి. 30 ఏళ్ల తర్వాత 2024లో రెండు పెద్ద గ్రహాల కలయిక సంభవించబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే అదే రాశిలో శని ఉంటాడు. కుంభరాశిలో శుక్రుడు, శని మైత్రి మేషం సహా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.
మిథున రాశి
వీరి సంపద పెరుగుతుంది. గతంలో అప్పుగా ఇచ్చి నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భారీ లాబాలను ఆర్జిస్తాయి. అదృష్టం తోడుండటంవల్ల ప్రతి పని విజయవంతమవుతుంది. తద్వారా భారీగా లాభాలను ఆర్జిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారు మంచి వృద్ధి సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు.

సింహ రాశి
సింహ రాశి వారికి గ్రహాల మైత్రి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. న్యాయపరమైన కేసుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఎంతో బాగుంటుంది. కెరీర్ లో పురోగతి ఉంది. ఆదాయం రెట్టింపవుతుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.
మేష రాశి
శుక్రుడు, శని కలయిక వల్ల వీరికి అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిగమిస్తారు. వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. అలాగే నిరుద్యోగులకు వారి కల నెరవేరుతుంది.
వృషభ రాశి
వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయం సాధిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల కోరిక నెరవేరుతుంది. ఎంత శ్రమ పడితే అంత ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.












Click it and Unblock the Notifications