చంద్ర గ్రహణం.. ఈ రాశులవెంటే మహాలక్ష్మి
శరద్ పూర్ణమ, చంద్ర గ్రహణం.. ఈ రెండింటికీ జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆరోజు చంద్రుడిని, లక్ష్మీదేవిని పూజించడంవల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శరద్ పూర్ణిమలో చంద్ర గ్రహణం నీడ ఉంటుంది. ఇది మన దేశంలో కూడా కనిపించనుంది.
తొమ్మిది సంవత్సరాల క్రితం రోజు కూడా శరద్ పూర్ణిమ రోజే చంద్ర గ్రహణం ఏర్పడింది. గ్రహణం సమయంలో చంద్రుడు మేషరాశిలో ఉంటాడు. అదే సమయానికి, అదే రాశిలో గురువు, బృహస్పతి కలయిక ఉండటం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల విశేష ప్రయోజనాలు పొందే రాశుల వివరాలు తెలుసుకుందాం.

మిథున రాశి: ఈ రాశివారికి బాగుంటుంది. అన్ని రంగాల్లో విజయం సాధించడంతోపాటు ధనలాభం కూడా ఉంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. మాటలతో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కుటుంబ సభ్యులతో వెచ్చించడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వ్యాపారంలో భారీ లాభాలున్నాయి.
కర్కాటక రాశి: వీరికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు పొందవచ్చు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
మకర రాశి: లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటంవల్ల వ్యాపారంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. గత కొంతకాలం నుంచి చేస్తున్న ప్రాజెక్టులో పరాజయం అనేదే ఉండదు. విహారయాత్రకు వెళతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది.












Click it and Unblock the Notifications