శనిదేవుడి దయతో వీరు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్యంలో శని న్యాయదేవుడు. శని తిరోగమనం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ఆయన కటాక్షం ఎవరిపై పడుతుందో వారికి జీవితంలో ఎటువంటి లోటు ఏర్పడదు. న్యాయదేవుడిగానే కాకుండా ఫలితాలిచ్చే దేవుడిగా కూడా పరిగణిస్తారు. కర్మలను బట్టి వీటిని ఇస్తుంటాడు. 2024లో కుంభరాశిలో ఉండి తన గమనాన్ని మార్చుకుంటాడు. 2024 ఫిబ్రవరిలో అస్తమించి మార్చి 18న ఉదయించే దశకు వస్తుంది. ఇలా శని స్థానం మారడంవల్ల మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి.

వృషభరాశి : వీరికి అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దీనివల్ల పొదుపు చేస్తారు. జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో చేసే పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

these zodiac sign people are very lucky due to Shani Dev Effect

తుల రాశి : జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి ఫలితాలున్నాయి. పెట్టుబడి నుంచి లాభాలు వస్తాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఏది అవసరమో అది మీకు అందుబాటులో ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇవి లాభసాటిగా ఉంటాయి.

ధనుస్సు రాశి : మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్త వస్తుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల అన్నివైపుల నుంచి శుభాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+