ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యంలో శుక్రుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సంపద, వైభవం, ఐశ్వర్యం, విలాసం, ఇంద్రియాలకు, శారీరక ఆనందానికి కారకుడు. శుక్రుడి గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ రంగాలపై విశేష ప్రభావం పడుతుంది. ఈనెల నాలుగోతేదీ నుంచి శుక్రుడు సంచారంలో ఉన్నాడు. దీనివల్ల ఆకస్మిక ధన లాభంతోపాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వివరాలు తెలుసుకుందాం.
తుల రాశి: శుక్రుడి సంచారం వీరికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. ఉపాధి విషయంలో అభివృద్ధి సాదిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను పొందడంతోపాటు ఇంక్రిమెంట్ తో కలిపి ప్రమోషన్ పొందుతారు.

మిథున రాశి: మిథునరాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంచార జాతకానికి సంబంధించి డబ్బు ఇంటిపై నేరుగా కదలబోతోంది. పెండింగ్ లో ఉన్న డబ్బును తిరిగి పొందుతారు. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నిధుల కొరత ఏర్పడితే వాటిని కూడా అధిగమిస్తారు. ఆస్తుల విషయంలో పూర్వీకుల నుంచి లాభాలుంటాయి. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. కోరికలన్నీ తీరడంతోపాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు.
కన్య రాశి : సంచార జాతకంలోని ఆదాయ గృహంపై శుక్రుడి సంచారం ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాదు.. వీరు కొత్త ఆలోచనలు చేస్తారు. పనిచేసే విషయంలో అదృష్టంతోడుంటుంది. వచ్చే ఆదాయం కొత్త వనరుల్ని సృష్టించవచ్చు. ఎక్కడ పెట్టుబడి పెట్టినా అక్కడ లాభదాయకత ఉంటుంది. బెట్టింగ్, లాటరీ, స్టాక్ మార్కెట్ వంటివాటి నుంచి లాభాలను పొందుతారు.












Click it and Unblock the Notifications