ఈ రాశులవారి జీవితాల్లో సంపద, ఐశ్వర్యం
జ్యోతిష్యంలో శుక్ర, శని గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శనిని కర్మఫలం దాతగా, శుక్రుడిని సంతోషం, విలాసం, సుఖానికి సూచికగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒకేసారి సంచారం చేయడమనేది అరుదుగా జరుగుతుంటుందని, దీని ప్రభావం మనుషుల వ్యక్తిగత జీవితాలపై ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ రెండు గ్రహాలు వ్యక్తుల జాతకాల్లో అనుకూల స్థానంలో సంచరిస్తే డబ్బుకు, అదృష్టానికి లోటుండదు. అదే ప్రతికూల స్థానాల్లో సంచారం చేస్తే మానిసక, శారీరక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
నవంబర్ 12న దీపావళి జరగబోతోంది. దీపావళికి ముందు నవంబర్ 3వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేస్తుంది. నవంబర్ 4న కుంభ రాశిలోకి శని గ్రహం ప్రవేశిస్తుంది. ఈ రెండింటివల్ల ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రావులవారికి కలిసివస్తే మరికొన్ని రాశులవారికి ప్రతికూల మార్పులు సంభవిస్తాయి.

మేషరాశి: ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగాలు చేసేవారికి అనుకూలం. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి బాగుంది. లాభదాయకంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. అదృష్టం తోడుగా ఉంటుంది.
వృషభ రాశి: కష్టపడి పనిచేసేవారికి అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థికంగా నవంబరులో ఊహించని లాభాలుంటాయి. గతం నుంచి వెంటపడి వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు సంబంధిత అంశాల్లో స్పష్టత వస్తుంది. ఊహించని లాభాలతో ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు.
మకర రాశి: ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. కెరీర్ కు సంబంధించి మార్పులు చోటుచేసుకుంటాయి. విద్యార్థులకు బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications