దసరా నవరాత్రులు... ఈ రాశులవారే మహారాజులు

వేద జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు తులారాశిలో సంచరించబోతున్నాడు. ఈ సంచారం అక్టోబర్ 18న జరుగుతుంది. ప్రస్తుతం సూర్య భగవానుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల 18వ తేదీన శుక్రుడి సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం మూడు రాశులవారికి అదృష్టాన్నితెస్తోంది. ఆ అదృష్ట రాశులు ఎవరెవరనేది తెలుసుకుందాం.

కన్యా రాశి : సూర్యుడి సంచారం వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో చిక్కుకుపోయిన డబ్బును తిరిగి పొందుతారు. అలాగే మీ మాటతీరు, దాని ప్రభావం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. సూర్యుడు కన్యా రాశి నుంచి 12వ ఇంటికి అధిపతి. డబ్బును ఆదాయం చేయడంద్వారా విజయం సాధిస్తారు. ప్రభుత్వ టెండర్ లేదంటే ప్రభుత్వ సంబంధిత పనులు చేసేవారికి ఈ సమయం చాలా మంచిది.

these zodiac sign people are very lucky due to sun will enter libra

ధనుస్సు రాశి : వీరికి మంచిరోజులు వచ్చాయి. ధనుస్సు రాశి నుంచి 11వ ఇంటిలో సూర్యుడు సంచరించబోతున్నాడు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల నుంచి డబ్బును సంపాదిస్తారు. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలున్నాయి. పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది. అలాగే వారికి సంబంధించిన శుభవార్తను కూడా వింటారు. పోటీపరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు.

మిథున రాశి : ప్రేమకు సంబంధించిన విషయాల్లో గెలుపొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కుటుంబ సభ్యుల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అలాగే ఊహించని ఆర్థిక లాభాలున్నాయి. సూర్యుడు మిథునరాశి నుంచి మూడో ఇంటికి అధిపతి కావడంవల్ల జాతకునికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దీనివల్ల చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+