సంక్రాంతి తర్వాత ఈ రాశులవారిపై కుబేరుడి దయ
గ్రహాలకు రాజైన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. సూర్యుడి సంచారం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈనెల 15వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకరం అనేది శనిదేవుడి రాశి. సూర్యుడితో తండ్రీ కొడుకుల బంధాన్ని శని కలిగివున్నప్పటికీ శత్రు భావం ఉంటుంది. మకరరాశిలోకి సూర్యుడు రావడం అనేది ఎంతో శుభం. ఆ సమయంలో శనిదేవుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. జ్యోతిష్యం ప్రకారం 15వ తేదీ తెల్లవారుజామున 2.54 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
మేషరాశి:సూర్యుడి సంచారం వీరికి ఎంతో కలిసి వస్తుంది. అదనపు ఆదాయానికి, కొత్త ఆదాయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. కుటుంబంతో సంతోషం వెల్లివిరుస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు.ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభరాశి:ఈ రాశి తొమ్మిదో ఇంట్లో సూర్యుడు సంచారం చేస్తున్నాడు. ఇది అదృష్టానికి కారణమవుతుంది. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళ్లివుంటే ఎంపికైన జాబితాలో ఉంటారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
సింహరాశి:సూర్యుడు, శని ప్రభావంతో ఈ రాశులవారి జీవితాల్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టే పెట్టుబడులు లాభాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.












Click it and Unblock the Notifications