సొంత రాశిలోకి సూర్యుడు.. వీరు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం ఆత్మకు కారకుడైన సూర్యుడు కొంతకాలం సంచరించిన తర్వాత నక్షత్రాన్ని మారుస్తాడు. సూర్యుడి రాశిలో మార్పు ప్రతి రాశికి చెందిన వ్యక్తుల జీవితాలను వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తుంది. ఈనెల 14వ తేదీ తెల్లవారుజామున 3.38 గంటలకు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. 27 రాశుల జాబితాలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రం 12వ రాశి. దీనివల్ల అనేక రాశులవారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకట్టుకునే వ్యక్తిత్వంతో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారవచ్చు. ఏయే రాశులవారికి దీనివల్ల కలిసివస్తుందో తెలుసుకుందాం.
మిథున రాశి : ఆత్మవిశ్వాసంతో పనులు చేయడంవల్ల అవి విజయవంతమవుతాయి. గతంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. పనితీరు, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. ఊహించనిరీతిలో ధనలాభం ఉంటుంది. విహారయాత్రకు వెళతారు.

సింహ రాశి : పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు విజయం సాధిస్తారు. వీరి నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. శాంతియుతంగా తీసుకున్న నిర్ణయాలు సరైనవని నిరూపణ అవుతుంది. పనిచేసేటోట అందరూ మెచ్చుకుంటారు. కొత్త ఆదాయ వనరులతోపాటు చాలాకాలం పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
ధనుస్సు రాశి : ఇతరుల పట్ల ఎంతో దయతో, భావోద్వేగంతో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అందరిచేత ప్రేమించబడతారు. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఆకస్మిక ప్రయోజనాలు కెరీర్ లో కలుగుతాయి. కార్యాలయంలో ప్రతిష్ట పెరుగుతుంది. అధికారుల హోదాలో పనిచేసేవారు విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications