ఆగస్టు 7 నుంచి ఈ రాశులవారంతా... 'ఓం సాయిరాం'
గ్రహాల స్థితిగతులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం క్షుణ్నంగా వివరిస్తోంది. ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనిషి సిరి సంపదలకు కారకుడైన శుక్రుడు ఈనెల ఏడోతేదీ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆరోజు ఉదయం 10.37 గంటలకు కర్కాటకంలో తిరోగమన దిశలో ప్రయాణిస్తాడు. అక్టోబరు 1వ తేదీ వరకు అక్కడే ఉండి అక్టోబరు రెండోతేదీ ఉదయం 1.18 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల నాలుగు రాశులవారికి ధన నష్టం, ఆర్థిక సంక్షోభం, సుఖాల కొరతతోపాటు సంబంధాలలో చేదు అనుభవాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
కర్కాటక రాశి : వీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో వివాదం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబం మొత్తం ఒత్తిడికి గురవుతుంది. తొందరపాటుతో తీసుకునే ఏ నిర్ణయమైన వీరికి హాని కలిగిస్తుంది.

సింహ రాశి : ఈ రాశివారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వృథా ఖర్చులను నివారించాలి. ఇతరుల సలహాలపై ఆధారపడి పెట్టుబడి పెట్టడంవల్ల నష్టం కలుగుతుంది. బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కన్యారాశి : ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఏం చెబుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది ప్రధానంగా మారుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. సవాళ్లు ఇబ్బంది పెడతాయి. విద్యా పోటీకి సంబంధించినవారికి కష్టంగా ఉంటుంది. డబ్బు కొరత ఉంటుంది. కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం.
కుంభరాశి : రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు ఇక్కట్లకు గురిచేస్తాయి. వైద్యానికి సంబంధించి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు జాగ్రత్త పడాలి. లాభాల్లో లోటు ఉంటుంది.. దీన్ని అధిగమించడానికి ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications