మకర సంక్రాంతి నుంచి ఈరాశులవారు పట్టుకుందల్లా బంగారమే
హిందువులకు ఎంతో ప్రధానమైన పండగ మకర సంక్రాంతి. ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును జరుపుకుంటారు. శుభముహూర్తాల్లో స్నానం చేయడం, దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శుభ సమయాల్లో దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జనవరి 15న గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కన్య, ధనస్సు రాశులతోపాటు మరికొన్ని రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి : సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడంవల్ల వీరి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గానికి ద్వారాలు తెరుచుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించడంవల్ల విజయాలు దక్కుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒత్తిడి తగ్గుతుంది. స్నేహితులతో కలిసి సమయాన్ని ఆనందగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి : సంక్రాంతి తర్వాత వీరికి ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్లు లభిస్తాయి. కష్టపడి పనిచేయడంవల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఎంత శ్రమ పడితే అంత ఫలితం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
కన్యా రాశి : సూర్యుడి సంచారం వీరికి మంచి జీవితాన్ని ఇస్తోంది. సానుకూల మార్పులతో, సానుకూల ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తారు. కార్యాలయాల్లో బిజీగా ఉండేవారికి ప్రశాంతత లభిస్తుంది. కష్టపడి పనిచేయడంవల్ల గౌరవాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications