శని-రాహు యుతి: అక్టోబరు 17 వరకు ఈ రాశులవారికి కష్టాలే
రాహువుకు అధిపతి అయిన శతభిషా నక్షత్రంలో శని సంచరిస్తున్నాడు. ఈ సమయంలో శని-రాహు కారణంగా ప్రభావం చెడుగా ఉంటుంది. ఐదు రాశులవారికి ఇబ్బందులు కలుగుతాయి. అక్టోబరు 17 తర్వాతే వీరికి బాగుంటుంది. అప్పటివరకు కష్టాలు తప్పవు. శని-రాహువు వల్ల ఏ రాశులవారికి ఇక్కట్లు కలగనున్నాయో తెలుసుకుందాం.
కర్కాటక రాశి: ఈ రాశివారికి ఉన్న సమస్యలకు తోడు మరిన్ని సమస్యలు తోడవుతాయి. వృత్తి పరంగా ప్రయాణం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రయివేటు కంపెనీల్లో చేసే ఉద్యోగులు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అక్టోబరు 17 వరకు పెట్టుబడులు పెట్టకూడదు. ఆ తర్వాతే మంచిరోజులు రానున్నాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలతోపాటు ఆరోగ్యం కూడా మెరుగపడుతుంది.
శని గ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పనికి సంబంధించి ప్రయాణం

కన్య రాశి:శని శతభిషలోకి ప్రవేశించడంవల్ల మానసికంగా గందరగోళంతోపాటు జీవితాల్లో కల్లోలం ఏర్పడుతుంది. ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటమే ఉత్తమం. ఇంటి ఖర్చుల కోసం రుణం తీసుకుంటారు. ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అక్టోబరు 17 తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పెట్టే పెట్టుబడుల్లో లాభాలు కూడా అప్పుడే వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
వృశ్చికరాశి: అక్టోబరు 17వ తేదీ వరకు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వాధికారితో విభేదాలు వస్తాయి. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబరు 17 తర్వాత రాహు, శని ప్రభావం తగ్గి గతంలో కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.
కుంభ రాశి: వచ్చే నాలుగు నెలలు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. అక్టోబరు తర్వాతే పరిస్థితులు సద్దుమణుగుతాయి. వ్యక్తిగత జీవితం అప్పటినుంచే బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
మీన రాశి: అక్టోబరు వరకు ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తుతాయి. అనవసరమైన ఖర్చులు పెరిగి బడ్జెట్ ను కకావికలం చేస్తాయి. అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. అక్టోబరు 17 తర్వాతే పరిస్థితుల్లో మార్పు చోటుచేసుకుంటుంది. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications