100 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ రాశుల దశ తిరుగుతోంది
మీన రాశిలో బుధుడి వక్ర గమనంవల్ల లక్ష్మీ నారాయణ యోగంతోపాటు బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. వచ్చేనెల రెండోతేదీన బుధుడు మేషరాశిలోకి సంచారం చేస్తాడు. తొమ్మిదో తేదీన బుధుడు వక్ర గమనంలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ బుధుడు, శుక్రుడి కలయిక లక్ష్మీనారాయణ యోగాన్ని సూచిస్తోంది. బుధుడు, రవి కలయికవల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
రాజయోగాలు ఈ రాశి 11వ ఇంట్లో జరుగుతున్నాయి. ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులతో కలిసి యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

మీనరాశి
ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా సాగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. అనుకోనిరీతిలో ఇవి వస్తాయి. కెరీర్ లో అద్భుత విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు ఉన్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయడానికి ఇది మంచి తరుణం. వీటిని ఎంతో జాగ్రత్తగా పూర్తిచేయాల్సి ఉంటుంది.
సింహ రాశి
ఈ రాశిలోని ఎనిమిదో ఇంట్లో యోగం ఏర్పడనుంది. దీనివల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయి. రాజయోగం ఎనిమిదో ఇంట్లో ఏర్పడబోతోంది. కొత్త వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.












Click it and Unblock the Notifications