గురువు, సూర్యుడి కలయిక.. ఈ రాశులు నక్క తోక తొక్కినట్లే
జ్యోతిష్యం ప్రకారం గురువు, సూర్యుడు మిత్రులు. ఈ రెండు కలిస్తే కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు కలుగుతుంటాయి. ప్రస్తుతం గురువు మేషరాశిలో ఉన్నాడు. అలాగే సూర్యుడు కూడా ఏప్రిల్ 13వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. వీరిద్దరి కలయిక 12 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. దీనివల్ల ఏయే రాశులవారికి బాగా కలిసిరానుందో, వారికి ఎప్పుడూ అదృష్టం తోడుందనుందో తెలుసుకుందాం.
మేష రాశి
కెరీర్ లో మంచి పురోగతి ఉంది. జీవితం ఎంతో చక్కగా సాగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడి బంధం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

మిథున రాశి
అదనపు ఆదాయాన్ని పొందేందుకు అనేక మార్గాలు ద్వారాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. వ్యక్తిగతంగా ఉన్న టాలెంట్ తో కెరీర్ లో విజయాన్ని సాధించడమే కాకుండా అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలపడటమే కాకుండా వారినుంచి పూర్తిస్థాయిలో మద్దతు అందుకుంటారు.
సింహ రాశి
ఈ రాశివారి జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే కాకుండా ధైర్యంగా అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం తోడుంటుంది. విద్యనభ్యసించేవారికి ఇది మంచి సమయం. అలాగే పోటీపరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు కూడా బాగా కలిసివస్తుంది. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారి కోరికరలు నెరవేరడానికి కూడా ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications