గురువు, అంగారకుడి సంయోగంతో ఈ రాశులవారే జమిందారులు
జ్యోతిష్యం ప్రకారం గురుడు, అంగారకుడు శక్తివంతమైన గ్రహాలు. ఆనందం, సంపద, ఐశ్వర్యం, ధైర్యం, శక్తి, డబ్బుకు ఈ రెండూ సూచిక. జులై 12వ తేదీన అంగారకుడు వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. గురువు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభంతోపాటు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఏయే రాశులవారికి ఈ రెండు గ్రహాల సంయోగంవల్ల బాగా కలిసిరానుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఇంట్లో ధనం విపరీతంగా పెరగడంతోపాటు డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితం ఎంతో గౌరవప్రదంగా సాగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. డబ్బులు పొదుపుచేసేవారికి ఎంతో బాగుంటుంది. ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది.

కర్కాటక రాశి
సానుకూల శక్తిని పొందుతారు. గురువు, అంగారకుడి సంయోగంవల్ల వీరి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతోపాటు పదోన్నతులు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు దొరుకుతుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో ఎటువంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో కొత్త విషయాలను నేర్చుకుంటారు.
సింహ రాశి
వీరికి విపరీతమైన ధనలాభం ఉంది. కెరీర్ లో ఉద్యోగానికి సంబంధించి అనేక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించి ఎటువంటి పనినైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సంపూర్ణమైన విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా వెసులుబాటు కలగడంతో మానసికంగా ప్రశాంతంగా వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications