లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహ వర్షం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈనెల 29వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది జరిగిన ఎనిమిది రోజులకు శుక్రుడు కూడా ఇదే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఒకే రాశిలో రెండు గ్రహాలు కలుస్తుండటంవల్ల ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. జన్మ జాతకంలో ఈ యోగం శుభ స్థానంలో ఉంటే పంట పండినట్లే. అన్ని సమస్యల నుంచి సులువుగా విముక్తి కలుగుతుంది. ఏయే రాశులవారికి, ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి. ఏ లక్ష్యాన్నైతే కల కంటున్నారో అది నెరవేరుతుంది. పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో కొన్నాళ్లుగా ఎదురవుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అన్నదమ్ములతో సంబంధాలు బాగుంటాయి. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది.

తులారాశి
లక్ష్మీ నారాయణ యోగంవల్ల ఈ రాశివారికి విపరీతమైన ధనలాభం ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కొత్త ఆదాయ వనరులు లభ్యమవుతాయి. కోరికలన్నీ నెరవేరతాయి. సంపద రెట్టింపు అవడంతోపాటు కెరీర్ కు సంబంధించి మంచి లాభాలు కలగనున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఎంతో లాభదాయకత ఉంటుంది. వ్యాపారాల్లో ఉన్నవారికి అడ్డంకులన్నీ సులభంగా తొలగిపోతాయి. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మంచి ఆర్థిక లాభాలను పొందుతారు.
వృశ్చిక రాశి
ఆర్థిక పరమైన సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతోపాటు వేతనాలు పెరుగుతాయి. పదోన్నతులు లభిస్తాయి.
ప్రేమికులకు వారి జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుంది.












Click it and Unblock the Notifications