5వ తేదీ నుంచి ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెల కొన్ని రాశులవారికే బాగుంటుంది. ఈ నెలలో బుధుడు మకర రాశిలోకి ప్రవేశించగా కుజుడు కూడా 5వ తేదీన ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీనివల్ల కొందరికి అదృష్టం కలిసి రాబోతోందని పండితులు తెలియజేస్తున్నారు. శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యం, సాహసాలకు కుజుడు ప్రతీతి. ఎవరి జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉంటాడో వారి కోరికలన్నీ నెరవేరతాయి. ఈనెల 5వ తేదీ నుంచి ఏ రాశులవారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

మేషరాశి
ఉద్యోగ జీవితంతోపాటు వృత్తి జీవితం కూడా బాగుంటుంది. పై అధికారుల నుంచి మద్దతు లభించడంతోపాటు ఇంక్రిమెంట్ తో కలిపిన ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో పూర్తి మద్దతు దొరుకుతుంది. మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగస్తులు కంపెనీని మారుస్తారు. ఆదాయం కూడా విశేషంగా పెరుగుతుంది.

these zodiac signs are very lucky due to Mars Transit Effect

వృషభ రాశి
తల్లి నుంచి మద్దతు లభించడంవల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అధికారుల నుంచి మద్దతు రావడంతో ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. ఆర్థికంగా లాభాలుంటాయి.

మిథున రాశి
కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో పనులన్నీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో మార్పు రావడంవల్ల ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పరమైన ప్రదేశాలను సందర్శించడానికి వెళతారు.

సింహరాశి
ఉద్యోగంలో మార్పులున్నాయి. కార్యాలయాన్ని మారుస్తారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారికి లాభాలుంటాయి. పై అధికారుల నుంచి మద్దతు దొరుకుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+