బుధుడి సంచారంతో ఈ రాశులవారి పంట పండినట్లే

ఈనెల 29వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. తెలివితేటలు, స్నేహం, గణితం, సంభాషణ, తర్కానికి కారకుడైన బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు. బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించడంవల్ల ఏయే రాశులవారికి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి
బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంవల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లి వైపు నుంచి ధనలాభం పొందుతారు. దాంపత్య సుఖం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. స్నేహితుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా మరోవైపు నుంచి ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరగడంతోపాటు ఆ కుటుంబంలోనే గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది.

these zodiac signs are very lucky due to mercury transit in cancer 2024

మిథునం
వీరిలో ఆత్మవిశ్వాసం కలగడంతోపాటు కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పరిశోధనతోపాటు ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో మార్పుకోరుకుంటున్నవారికి అది దక్కుతుంది. స్థానచలనం కూడా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తల్లి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ధనలాభం ఉంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి సహకారం లభించడంతో పనులను పూర్తిచేస్తారు.

సింహ రాశి
అడుగు పెట్టిన రంగంలో లాభం ఉంటుంది. విద్యాపరమైన పనులు విజయాన్ని అందిస్తాయి. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అడుగు పెట్టిన రంగంలో విజయం సాధిస్తారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది.

కన్యా రాశి
పరిశోధన కోసం వేరే ప్రాంతానికి వెళతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. దీనివల్ల మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం పెరగడంతోపాటు అన్ని పనులకు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

ధనుస్సు
తల్లి వైపు నుంచి ధనం పొందుతారు. కళలు, సంగీతంపై అనురక్తి కలుగుతుంది. ఉద్యోగ స్థానంలో మార్పు వస్తుంది. దీనివల్ల అధికంగా శ్రపడతారు. ఆదాయం పెరగడంతోపాటు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. వాహన సౌకర్యం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+