కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. డబ్బుతో తులతూగుతారు

సంపదకు దేవత లక్ష్మీదేవి. అయితే కుబేరుడిని అధి దేవుడిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం కుబేరుడికి సంపద బాధ్యతలను అప్పగించిన రోజే అక్షయ తృతీయ. కుబేరుడి ఆశీస్సులు ఉంటే సంపద, ఆనందం దక్కుతాయి. జీవితం మొత్తం సంపదతో నిండిపోతుంది. కుబేరుడిని ఎవరైతే మెప్పించగులుగుతారో వారికి జీవితాంతం డబ్బుకు కొరత ఎదురవదు. ఒక్కో రాశిని ఒక్కో గ్రహం పాలిస్తుంటుంది. గ్రహాల ప్రభావంతో అన్ని రాశులవారికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే కుబేరుడికి కూడా ఇష్టమైన రాశులు మూడు ఉన్నాయి. అవి వృషభరాశి, కర్కాటకరాశి, ధనుస్సు రాశి.

వృషభ రాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరికి కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. సమస్యలేవీ వీరిని ఇబ్బంది పెట్టలేవు. సులువుగా వాటిని పరిష్కరించుకుంటారు. కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

these zodiac signs get always money due to lord kubera likes these zodiac signs

కర్కాటక రాశి
కర్కాటక రాశివారంటే కుబేరుడికి చాలా ఇష్టం. పాలకుడిగా చంద్రుడు ఉంటాడు. కష్టపడి పనిచేసి తమ లక్ష్యాలను సాధించుకుంటారు. ఎటువంటి ఛాలెంజ్ నైనా ఎదుర్కొంటారు. భారీగా డబ్బు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. జ్ఞానం, తెలివితేటలు, ప్రతిభ ద్వారా జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

ధనుస్సు రాశి
ఆధ్యాత్మికతలో ఉంటారు. దీనివల్లే కుబేరుడి ఆశీస్సులు ఉంటాయి. డబ్బు, అదృష్టంతో తులతూగుతారు.

కుబేరుడి ఆశీర్వాదం పొందాలంటే..
నగదు లాకర్ ముందు అద్దం ఉంచండి. లాకర్ ప్రతిమ అద్దంలో కనపడాలి. ఇది ఆస్తులను పెంచుతుంది. దక్షిణ లేదంటే నైరుతి గోడపై లాకర్ లేదంటే అల్మారాను ఏర్పాటు చేసుకొని అందులో డబ్బులు దాచిపెట్టుకోవాలి. తలుపు ఉత్తరాన తెరవాలి. ఈ దిశ కుబేరుడికి సంబంధించినది. ఉత్తరంవైపు తలుపు తెరవడంవల్ల లాకర్ లో నిరంతరం డబ్బు ఉంటుంది. దానం చేస్తే మూడో కంటికి కూడా తెలియకుండా చేయాలి. ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వ సేవలకు ఉపయోగించాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఇంట్లో కుబేర యంత్రం ఉంచి పూజించాలి. ఇంట్లో తులసి మొక్క నాటాలి. ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించాలి. విరిగిన చిత్రపటాలు, చిరిగిపోయిన వస్త్రాలు, పగిలిపోయినవి ఇంట్లో ఉంచుకోకూడదు. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+