ఈ రాశులకు అదృష్టం దరిద్రంలా పట్టుకుంటుంది

వివాహానికి, సంతానానికి, సంపదకు, శ్రేయస్సుకు కారకుడైన బృహస్పతి మే ఒకటో తేదీన వృషభరాశిలోకి ప్రవేశించాడు. 2025 వరకు అక్కడే సంచారం చేస్తాడు. అలాగే ధైర్యసాహసాలకు, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు కారకుడైన కుజుడు 45 రోజులకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు. కుజుడు వృషభరాశిలోకి ప్రవేశించి అక్కడే సంచారం చేస్తున్న గురువుతో కలుస్తాడు. కుజుడు, బృహస్పతి కలయిక అన్ని రాశులపై ప్రభావం చూపుతున్నప్పటికీ కొన్ని రాశులపై మాత్రం విశేష ప్రభావం చూపి యోగాన్ని కల్పిస్తుంది.

మేష రాశి
అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది. మీకున్న వ్యక్తిత్వ వికాసం, మాట్లాడే తీరు, ఎదుటివారిని ఆకట్టుకునే తీరువల్ల అన్ని పనులు విజయవంతమవుతాయి. జీవితంలో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడానికి ఇది అనువైన సమయం. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. శ్రమను బట్టి ఫలితం ఆధారపడివుంటుంది. ఎంత కష్టపడితే అంత ఆర్థిక లాభాలున్నాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

these zodiac signs get more money due to Conjunction of Jupiter and Mars in Taurus

కుంభరాశి
కుజుడు, గురుడి కలయిక వీరికి మంచి యోగాన్ని కల్పిస్తుంది. అన్నిరకాల సంతోషాలు కలుగుతాయి. ఈ రాశిచక్రం నాలుగో ఇంట్లో యోగం సంభవిస్తుంది. ఈ సమయంలో కొత్త ఇంటితోపాటు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రయాణాలున్నాయి. ఇవి కూడా లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. దాన్ని జాగ్రత్త చేసుకోవడంపై భవిష్యత్తు ఆధారపడివుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+