దీపావళి వరకు ఈ రాశులవారు ఉత్తర దిక్పాలకులు కాబోతున్నారు
శని దేవుడు అతి నెమ్మదిగా సంచారం చేస్తుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. మొత్తం 12 రాశుల్లోను సంచరించి రావడానికి 30 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ప్రస్తుతం తిరోగమన దిశలో ఉన్న శని నవంబరు 15వ తేదీన ప్రత్యక్ష దిశలోకి వస్తాడు. అప్పటివరకు కుంభరాశిలో ఉన్నవాడు కాస్తా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శని ప్రత్యక్ష దిశలోకి రావడంవల్ల కొన్ని రాశులవారు కుబేరుడికి సోదరులు అవుతున్నారు. ఏ రాశులవారికి బాగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఒకరకంగా కుబేరులు అవుతారు. దీపావళి పండగ వీరికి అదృష్టాన్ని మోసుకొస్తోంది. ఎంత కష్టపడితే అంత లాభపడతారు. కుటుంబంలో కొన్నాళ్ల నుంచి ఉన్న సమస్యలు ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి. వృత్తిపరంగా ఎదురవుతున్న సమస్యలను సులువుగా పరిష్కరింపచేసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరిగి జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది.

మిథున రాశి
దీపావళి వరకు వీరికి ఉన్న సమయమంతా అనుకూలమే. కష్టానికి తగిన ప్రతిఫలం పొందడంతోపాటు ఎంత కష్టపడితే అంత ఆదాయాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి చూపించడంతోపాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కెరీర్ లో ఇప్పటివరకు ఎదరైన కష్టాలన్నీ తొలగిపోవడంతోపాటు మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
ధనుస్సు రాశి
వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. దీనివల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆర్థికంగా స్థిరపడతారు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు వారి వారి కార్యాలయాల్లో పెద్ద బాధ్యతలను స్వీకరించడంతోపాటు పెరిగిన వేతనాన్ని అందుకుంటారు. వీరి పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యలను ఈ సమయంలో ఎంతో సులువుగా పరిష్కరించుకుంటారు.












Click it and Unblock the Notifications