కీలక గ్రహాల సంచారంతో ఈ రాశులకు అఖండ రాజయోగం
మీన రాశిలో శుక్రుడు, బుధుడు, కుంభ రాశిలో శని, కుజుడు, మేష రాశిలో రవి, గురువు యుతి చెందడంతో అఖండ రాజయోగం ఏర్పడింది. దీనివల్ల ఆరు రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. భోగభాగ్యాలతోపాటు అధికార యోగం పడుతుంది. వీరి జీవితాలన్నీ సానుకూలంగా మారతాయి. ఈ నెలంతా వీరికి శుభప్రదంగానే ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది.
మేషం
ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ తోపాటు అధికారానికి అవకాశం ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు. వృత్తిలో ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలవుతాయి.

వృశ్చికం
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సంస్థకు అధికారి అయ్యే అవకాశం కనపడుతోంది. వృత్తి, వ్యాపారాలతో లాభాలబాట పడతారు. కోరికలు నెరవేరతాయి. ఉద్యోగులకు డిమాండ్ ఉంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం చేయాల్సి వచ్చినప్పటికీ చివరకి అది కూడా లాభసాటిగా మారుతుంది.
ధనుస్సు
ఉద్యోగంలో అధికార యోగం ఉంది. సంస్థకు అధిపతి అవుతారు. వృత్తి జీవితంలో రాబడి ఉంటుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలుంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
మకరం
చిన్న ప్రయత్నంతోనే అధికారం చేపడతారు. ఆర్థికంగా అందలమెక్కుతారు. పరిచయాలు లాభసాటిగా మారతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్నా గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలవల్ల లాభం కలుగుతుంది.
కుంభం
నెలరోజులు పట్టిందల్లా బంగారం కానుంది. ఏ రంగంలో ఉన్నా రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో మంచి పరిణామాలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలనిస్తాయి. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి పరిణామాలు ఎదురవుతాయి. శుభవార్తలను వింటారు.
మీనం
వీరికి మహా భాగ్య యోగంపడుతుంది. నెలరోజులు సుఖసంతోషాలతో సాగుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగుపడుతుంది. కోరికలన్నీ నెరవేరతాయి. జీవితం విలాసాలతో గడిచిపోతుంది.












Click it and Unblock the Notifications