Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ రాశులవారు ప్రధానమంత్రి కాలేరు.. రాశులవారీగా దేశ ప్రధానిగా పనిచేసినవారి జాబితా ఇదే!!

భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు మన దేశ ప్రధానిని నిర్ణయించబోతున్నాయి. ఎవరు దేశ ప్రధాని అవుతారు అన్న చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీనే అవుతారని భావిస్తుంటే, ఈసారి INDI కూటమి విజయం సాధిస్తుందని దేశ ప్రధానిగా INDI కూటమి అభ్యర్థులకు అవకాశం వస్తుందని చెబుతున్నారు.

10 రాశులవారికి ప్రధానిగా అవకాశం
అయితే జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం ఇప్పటివరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలలో మొత్తం 15 మంది ప్రధాన మంత్రి పదవిని నిర్వహించారు. వీరిలో పది మంది వ్యక్తులు ఐదు రాశులకు చెందిన వారు కాగా మిగిలిన ఐదుగురు మరో ఐదు రాశులకు చెందినటువంటి వ్యక్తులు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండు రాశుల వారు ప్రధాన మంత్రిగా నియమించబడలేదు.

These zodiac signs have not become prime minister yet This is the list of PM by zodiac sign

మొత్తం 10 రాశుల నుండి 15 మంది ప్రధానులు
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పది మంది ప్రధాన మంత్రులు ఐదు రాశులకు చెందిన వారు దేశాన్ని పాలించారు కర్కాటకం,సింహం, కన్య, తుల మరియు వృశ్చిక రాశుల నుండి ఇద్దరిద్దరు ప్రధానులుగా పనిచేశారు. మిగిలిన అయిదుగురు ప్రధానులు ధనుస్సు, కుంభం, మకరం, మీనం మరియు మేషరాశి నుంచి ఒక్కొక్కరు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు.

ఏ రాశి నుండి ఎవరెవరు ప్రధానులుగా పని చేశారంటే
భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇద్దరు కర్కాటక రాశిలో జన్మించిన వారు. వీరిద్దరూ దేశానికి ప్రధానులుగా పనిచేశారు. మేషరాశి నుండి ఏప్రిల్ 1997 మార్చి 1998 వరకు కేవలం ఒక సంవత్సర కాలానికి ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రిగా పనిచేశారు.ఇక సింహరాశి నుండి మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ ఇద్దరూ దేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేశారు.

వృశ్చిక రాశి నుండి మోడీతో పాటు అటల్ బిహారీ వాజ్ పేయి
కన్య రాశి నుండి లాల్ బహదూర్ శాస్త్రి, చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. తులారాశి నుండి విశ్వనాథ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ ప్రధాన మంత్రులుగా పనిచేశారు. వృశ్చిక రాశి నుండి ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ, అటల్ బిహారి వాజ్పేయి ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు. ధనుస్సు రాశి నుండి గుల్జారి లాల్ నంద 13 రోజులపాటు తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు.

రెండు రాశులవారికి ప్రధాని పదవి దక్కలేదు
మకర రాశి నుండి ఇందిరా గాంధీ భారత ప్రధానిగా పనిచేశారు. కుంభరాశి నుండి హెచ్డి దేవేగౌడ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. మీనరాశి నుండి భారత దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు పనిచేశారు. అయితే ఇప్పటివరకు దాదాపు పది రాశుల నుండి భారతదేశానికి ప్రధాన మంత్రులు అయ్యారు. కేవలం రెండు రాశుల వారు మాత్రం ఇప్పటివరకు ప్రధాని పదవి దరికి చేరలేదు. వృషభ రాశి నుండి, మిధున రాశి నుండి ఇప్పటివరకు ఎవరు ప్రధానమంత్రి కాలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+