ఈ రాశులకు అఖండ రాజయోగాన్ని ప్రకటించిన శనిదేవుడు
గ్రహాల్లో ప్రత్యేకత కలిగిన శనిదేవుడు న్యాయదేవుడు, కర్మ ప్రదాత. చేసిన కర్మలను బట్టి ఫలితాలను అనుగ్రహిస్తాడు. మనిషి మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతాడు. ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తే వారి కర్మల ప్రకారం ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం శనిదేవుడు వక్ర గమనంలో ఉన్నాడు. వచ్చే నెలలో ఆయన రాహువు నక్షత్రంలో, కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల 12 రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అయితే ఏడు రాశులవారిపై మాత్రం మంచి ప్రభావాన్ని కలిగిస్తున్నాడు.
తుల రాశి
రాహువు సంచారంవల్ల కొన్నాళ్లు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగంలో పై అధికారి నుంచి ఉండే చికాకులు తొలగిపోతాయి.

మకర రాశి
రాహువు మిత్ర గ్రహం కావడం, శనిదేవుడి స్వక్షేత్రం కావడంతో ఆయన అపార కరుణ మకర రాశివారిపై ఉంటుంది. వీరు చేపట్టే ప్రతి పని విజయవంతంగా ముగుస్తుంది. రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
కుంభ రాశి
అనుకూల ఫలితాలే ఎదురవుతాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా కలిసివస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారికి కలిసివస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అవకాశాలు తలుపు తడతాయి.
సింహ రాశి
కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నింటినీ సకాలంలో పూర్తిచేస్తారు.
కన్య రాశి
సప్తమ స్థానంలో శని ఉన్నాడు. తల్లి లేదంటే తండ్రివైపు పెద్దల నుంచి ఆస్తులు కలిసిరాబోతున్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.
మేష రాశి
ఏల్నాటి శని ఉన్నప్పటికీ ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. పెళ్లి కానివారికి వివాహ యోగం ఉండబోతోంది. కుటుంబ పరంగా సుఖసంతోషాలు చోటుచేసుకోవడంతోపాటు శుభకార్యం జరుగుతుంది.
మిథున రాశి
వీరి జీవితం బంగారు మయంగా మారబోతోంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది.












Click it and Unblock the Notifications